Viral Video: గజరాజుకు కోపం వస్తే మృగరాజైనా తోకముడవాల్సిందే..! సింహాలకే సుస్సు పొయించిన ఏనుగు.. షాకింగ్ వీడియో

|

Mar 13, 2022 | 6:30 PM

Elephant - Lions Video: సింహం సింగిల్‌గానే వస్తుంది.. పందులే గుంపులుగా వస్తాయి.. అనే డైలాగ్ తెలుగు ప్రేక్షకులను ఊర్రూతులుగించిన విషయం తెలిసిందే. అయితే.. అలాంటి సింహాల మందే.. గజరాజు కోపానికి పరుగులు తీశాయి.

Viral Video: గజరాజుకు కోపం వస్తే మృగరాజైనా తోకముడవాల్సిందే..! సింహాలకే సుస్సు పొయించిన ఏనుగు.. షాకింగ్ వీడియో
Viral Video
Follow us on

Elephant – Lions Video: సింహం సింగిల్‌గానే వస్తుంది.. పందులే గుంపులుగా వస్తాయి.. అనే డైలాగ్ తెలుగు ప్రేక్షకులను ఊర్రూతులుగించిన విషయం తెలిసిందే. అయితే.. అలాంటి సింహాల మందే.. గజరాజు కోపానికి పరుగులు తీశాయి. అదేంటి..? అడవికి రాజులైన సింహాలు గజరాజును చూసి పారిపోవడం ఏంటీ అనుకుంటున్నారు.. కదా..? ఓ ఏనుగుకు కోపం రావడంతో.. సింహాలన్నీ అక్కడి నుంచి పరారైన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వాస్తవానికి సింహాలు అత్యంత ప్రమాదకరమైన జంతువులలో ఒకటి. ఇవి చాలా శక్తివంతమైనవి.. అడవిలో నిర్భయంగా తిరుగుతాయి. వేట విషయంలో సింహాలకు సాటి ఉండదు. అవి పెద్ద జంతువులను సైతం వేటాడుతాయి. కొన్నిసార్లు అవి భూమిపై ఉన్న అతిపెద్ద జంతువు అంటే ఏనుగును కూడా ఆహారంగా చేసుకుంటాయి. అయితే.. ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.. అందులో తన కోసం వేటకు వచ్చిన సింహాలను.. ఒక ఏనుగు దడదడలాడిస్తుంది.

వీడియోలో సింహాల మంద.. అడవిలో ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. కానీ అవి ఏనుగుకు సమీపంలోనే ఉంటాయి. దీంతో ఏనుగు చిర్రెత్తుకొస్తుంది. వెంటనే ఘీంకరిస్తూ.. సింహాల వైపు దూసుకెళ్తుంది. దీంతో సింహాలు అక్కడి నుంచి పారిపోతాయి. అయితే.. గజరాజు కోపానికి.. సింహాల మంద పారిపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే సాధారణంగా సింహాల మంద ఒంటరిగా ఉన్న జంతువును చూసి పారిపోవని.. వేటాడే అవకాశం ఉన్నా పరిగెత్తాయంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.

వైరల్ వీడియో..

ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో africanwildlife1 యూజర్ షేర్ చేశారు. అసలు అడవికి రాజు ఎవరో చెప్పండి..? అంటూ క్యాప్షన్ కూడా రాశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 1 లక్షా 87 వేల మంది వీక్షించగా.. 6 వేల మందికి పైగా లైక్ చేసారు. దీంతోపాటు ఈ వీడియోను చూసిన యూజర్లు పలు రకాల కామెంట్లు కూడా చేస్తున్నారు.

Also Read:

Viral: ఆస్పత్రిలో సినీ ఫక్కీలో పెళ్లి.. బ్యాక్ స్టోరీ తెలిస్తే మీరు పక్కాగా షాకవుతారు

Viral: బాత్రూం యూజ్ చేసేందుకు తలుపు తీశాడు.. లోపల దృశ్యం చూసి పరుగో పరుగు