పాము గుడ్లను తింటే మనిషి చనిపోతాడా..? 99శాతం మందికి తెలియని నిజాలు ఇవే..

Snake Eggs: గుడ్లు అంటేనే పోషకాల నిలయం. డాక్టర్లు సైతం మంచి ఆరోగ్యానికి రోజూ గుడ్డు తినమని చెప్తారు. మనం కేవలం కోడి గుడ్లు మాత్రమే తింటాం. ఇతర జంతువుల గుడ్ల జోలికి వెళ్లం. మరి పాము గుడ్లు తింటే ఏమవుతుంది..? మనిషి చనిపోతాడా..? అనే డౌట్లు చాలా మందిలో ఉంటాయి. సోషల్ మీడియాలోనూ ఈ చర్చ జోరుగా సాగుతుంది. దీన్ని గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

పాము గుడ్లను తింటే మనిషి చనిపోతాడా..? 99శాతం మందికి తెలియని నిజాలు ఇవే..
What Happens If You Eat Snake Eggs

Updated on: Jun 19, 2026 | 4:55 PM

మన దేశంలో గుడ్లకు ఉండే క్రేజే వేరు. వంటింట్లో దీనికి స్పెషల్ ప్లేస్. సండే అయినా, మండే అయినా ఎగ్ ఉంటే ఆ మజానే వేరు. డాక్టర్లు సైతం ఆరోగ్యానికి రోజు గుడ్డు తినమని సలహా ఇస్తారు. అయితే మనం కోడిగుడ్లను మాత్రమే తింటాం. ఇతర జంతువుల గుడ్ల జోలికి వెళ్లం. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఒక వింత చర్చ నడుస్తోంది. ‘‘ఒకవేళ మనిషి పాము గుడ్లను తింటే ఏమవుతుంది? ఒకేసారి ఐదు పాము గుడ్లు తింటే ప్రాణాలు పోతాయా?” అనే ప్రశ్నలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ క్రేజీ ప్రశ్న వెనుక ఉన్న అసలు నిజాలు, శాస్త్రీయ కారణాల ఏంటీ అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం.

గుడ్డులో విషం ఉంటుందా?

సాధారణంగా పాము అనగానే మనకు గుర్తొచ్చేది భయంకరమైన విషం. దాంతో దాని గుడ్లలో కూడా పాయిజన్ ఉంటుందని చాలామంది అనుకుంటారు. ఆ గుడ్లను ముట్టుకోవడానికి కూడా భయపడతారు. కానీ వన్యప్రాణి నిపుణుల ప్రకారం.. పాము విషం అనేది దాని నోటిలోని దంతాల వెనుక ఉండే ప్రత్యేక గ్రంథులలో మాత్రమే ఊరుతుంది. పాము శరీరంలో లేదా అది పెట్టే గుడ్లలో విషం ఉండదు. కాబట్టి పాము గుడ్డు తిన్న వెంటనే బాడీలోకి పాయిజన్ ఎక్కి మనిషి స్పాట్‌లోనే చనిపోతాడనే దాంట్లో అస్సలు నిజం లేదు. ఒకవేళ ఆ గుడ్డు పొదిగే దశకు వచ్చి, లోపల పాము పిల్ల పూర్తిగా తయారై ఉంటే మాత్రం ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది.

విషం లేకపోయినా.. ప్రాణాంతకమే..

గుడ్డులో విషం లేనంత మాత్రాన అది తినడానికి సురక్షితం అని మాత్రం అనుకోకూడదు. పాము గుడ్లను ఆహారంగా తీసుకుంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సాల్మొనెల్లా బ్యాక్టీరియా ముప్పు: పాములు, బల్లులు వంటి సరీసృపాల గుడ్లపైన సాల్మొనెల్లా అనే డేంజరస్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపులోకి వెళ్తే తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ జరిగి.. వాంతులు, విరేచనాలు, ప్రాణాలు తీసేంత జ్వరం వస్తాయి.

అనాఫిలాక్సిస్ : వైల్డ్ యానిమల్స్ గుడ్లలో ఉండే కొన్ని రకాల ప్రోటీన్లు మానవ జీర్ణవ్యవస్థకు అస్సలు పడవు. దీనివల్ల శరీరం అంతా దద్దుర్లు రావడం, శ్వాస వ్యవస్థ స్తంభించిపోవడం వంటి అత్యంత ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయి. అంతేకాకుండా అడవిలో పెరిగే జీవుల గుడ్లలో ఉండే కొన్ని రకాల పరాన్నజీవులు మన కడుపులోకి చేరి అంతర్గత అవయవాలను పాడు చేస్తాయి.

విదేశాల్లో తింటారు కదా.. మరి వాళ్లకెందుకు ఏం కాదు?

చైనా, వియత్నాం వంటి ఆగ్నేయాసియా దేశాల్లో పాము మాంసం, గుడ్లు తినే సంస్కృతి ఉన్న మాట వాస్తవమే. కానీ వాళ్లు వాటిని పచ్చిగానో, అరకొరగానో ఉడికించి తినరు. లోపల ఉండే బ్యాక్టీరియా, పరాన్నజీవులు పూర్తిగా చనిపోయేలా.. అత్యధిక ఉష్ణోగ్రత వద్ద పక్కాగా ఉడికించిన తర్వాతే తింటారు.

తింటే జైలు శిక్ష పక్కా..

మన దేశంలో పాము గుడ్లు తినడం అనేది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాదు.. అంతకంటే పెద్ద చట్టపరమైన నేరం. భారతీయ వన్యప్రాణుల రక్షణ చట్టం ప్రకారం పాములు, వాటి గుడ్లను సేకరించడం, నష్టపరచడం లేదా తినడం నాన్ బెయిలబుల్ నేరం. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే భారీ ఫైన్‌తో పాటు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుంది. పైగా మన దేశ సంస్కృతిలో పాములను దైవంగా భావిస్తారు కాబట్టి ఇలాంటి పిచ్చి ప్రయోగాలు సమాజం కూడా అంగీకరించదు.

పాము గుడ్డు తింటే వెంటనే విషం ఎక్కి చనిపోరు కానీ.. అది తెచ్చిపెట్టే ఇన్ఫెక్షన్లు, రోగాలు, చట్టపరమైన శిక్షలు మాత్రం జీవితాన్ని తలకిందులు చేస్తాయి. ప్రోటీన్ల కోసం ఇలాంటి వింత ప్రయోగాలు చేయాల్సిన పని లేదు, మనకు మార్కెట్లో దొరికే కోడిగుడ్లే అన్నిటికంటే బెస్ట్ అనేది అందరూ గుర్తుంచుకోవాలి.

చాలా మందికి వచ్చే డౌట్లు

ప్రశ్న: పాము గుడ్లలో విషం ఉంటుందా?

జవాబు: లేదు, పాము గుడ్లలో విషం ఉండదు. పాము విషం అనేది దాని నోటిలోని దంతాల వెనుక ఉండే ప్రత్యేక విష గ్రంథులలో మాత్రమే ఉంటుంది.

ప్రశ్న: పాము గుడ్లు తింటే మనిషి చనిపోతాడా?

జవాబు: పాము గుడ్డు తింటే మనిషి చనిపోడు. కానీ ఆ గుడ్డుపై ఉండే బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలె ఉంటాయి.

ప్రశ్న: చైనా, వియత్నాం లలో పాము గుడ్లను ఎలా తింటారు?

జవాబు: వారు వాటిని పచ్చిగా అస్సలు తినరు. లోపల ఉండే బ్యాక్టీరియా, పరాన్నజీవులు పూర్తిగా నశించేలా అత్యధిక ఉష్ణోగ్రత వద్ద పక్కాగా ఉడికించిన తర్వాతే తింటారు.

Follow Us