ఆ ఒక్క బిల్డింగ్ పైనే వర్షం.. కానీ..!

| Edited By:

Nov 06, 2019 | 6:31 PM

కొన్నిసార్లు ఒకే ప్రాంతంలో సగం వర్షం, సగం ఎండ ఉంటుంది. ఇది చూసేందుకు భలే విచిత్రంగా ఉంటుంది. ఇందుకు కారణం ఆకాశంలో విస్తరించిన మేఘాల పరిస్థితి. అయితే, పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియా ప్రాంతంలో మాత్రం చిత్రంగా ఒకే భవనం మీద వర్షం కురవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఉదయం వాకింగ్ వెళ్తున్నవారికి ఈ విచిత్రం కంటపడింది. 61 అంతస్తుల భవనం మీద నుంచి కురుస్తున్న ఆ వర్షం చూసి ఎక్కడివారు అక్కడే నిలిచిపోయారు. సుమారు ఐదు నిమిషాలపాటు కురిసిన ఆ […]

ఆ ఒక్క బిల్డింగ్ పైనే వర్షం.. కానీ..!
Follow us on

కొన్నిసార్లు ఒకే ప్రాంతంలో సగం వర్షం, సగం ఎండ ఉంటుంది. ఇది చూసేందుకు భలే విచిత్రంగా ఉంటుంది. ఇందుకు కారణం ఆకాశంలో విస్తరించిన మేఘాల పరిస్థితి. అయితే, పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియా ప్రాంతంలో మాత్రం చిత్రంగా ఒకే భవనం మీద వర్షం కురవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

ఉదయం వాకింగ్ వెళ్తున్నవారికి ఈ విచిత్రం కంటపడింది. 61 అంతస్తుల భవనం మీద నుంచి కురుస్తున్న ఆ వర్షం చూసి ఎక్కడివారు అక్కడే నిలిచిపోయారు. సుమారు ఐదు నిమిషాలపాటు కురిసిన ఆ వర్షాన్ని తమ మొబైల్ కెమేరాల్లో బంధించారు. అప్పటివరకు దాన్ని చూసినవారు వర్షం అనే అనుకున్నారు.

కాగా.. అది వర్షం కాదు..: మొదట్లో అంతా దాన్ని వర్షం అనే అనుకున్నారు. అయితే, అది వర్షం కాదని, ఆ భవనం మీద ఉన్న ఫైర్ సిస్టమ్ వ్యవస్థను పరీక్షించడంలో భాగంగా నీటిని అలా వదిలామని అగ్నిమాపక అధికారులు ప్రకటించారు. ఈ భవనాన్ని 1987లో నిర్మించినట్లు అధికారులు తెలిపారు. అప్పటి నుంచి ఈ భవనంలోని అగ్నిమాపక వ్యవస్థలో మార్పులు చేస్తూ వస్తున్నామని వెల్లడించారు.