Viral Video: చావు తప్పి కన్ను లొట్ట పడటమంటే ఇదే.. రెప్పపాటులో యమలోకానికి.!

రోడ్డుపై ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలంటారు. ఎప్పుడు.. ఏ రూపంలో ప్రమాదం ఎటునుంచి వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. అందుకే మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు..

Viral Video: చావు తప్పి కన్ను లొట్ట పడటమంటే ఇదే.. రెప్పపాటులో యమలోకానికి.!
Viral Video

Updated on: Jun 12, 2023 | 9:10 AM

రోడ్డుపై ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలంటారు. ఎప్పుడు.. ఏ రూపంలో ప్రమాదం ఎటునుంచి వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. అందుకే మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అన్ని వైపులా చూసుకుంటూ.. ఆచితూచి బండిని నడపడం చాలా ముఖ్యం. ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాల్లో రెప్పపాటులో మృత్యువును తప్పించుకున్న ఘటనలను చాలానే చూశాం. ఇలాంటివి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. సరిగ్గా ఈ తరహా ఘటన ఒకటి కేరళలోని కోజికోడ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇద్దరు విద్యార్ధినులు రెప్పపాటులో చావును తప్పించుకున్నారు. యముడు లంచ్‌ బ్రేక్‌కు వెళ్ళినట్లు ఉన్నాడు.. ఆ యువతులు అదృష్టవశాత్తు భారీ ప్రమాదాన్ని తప్పించుకోగలిగారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

వీడియో ప్రకారం.. ఇద్దరు యువతులు స్కూటీపై యమా స్పీడ్‌గా వెళ్తున్నారు. వారి ముందు ఓ బస్సు వెళ్తుండగా.. దాన్ని ఓవర్ టేక్ చేయాలని భావిస్తారు. స్కూటీ నడుపుతోన్న యువతి స్పీడ్‌గా పక్క నుంచి పోనిచ్చేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఆ రోడ్డు ఇరుక్కుగా ఉండటం.. ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా ఓ ట్రక్ వస్తుంది. స్కూటీ కాస్తా ఆ ట్రక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు యువతులు రోడ్డుపై పడిపోవడమే కాదు.. హెల్మెట్‌లు కూడా రోడ్డుపై దొర్లుతాయి. అటు ట్రక్.. ఇటు బస్సు మధ్యలో స్కూటీ ఇరుక్కుపోవడంతో ఈ ప్రమాదం జరుగుతుంది. బహుశా యముడు లంచ్‌ బ్రేక్ తీసుకున్నట్లు ఉన్నాడు.. అదృష్టవశాత్తు ఈ ఘటనలో యువతులకు పెద్దగా గాయాలు కాలేదు. తృటిలో భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. బండి నడిపేటప్పుడు జాగ్రత్త అవసరమని హితబోధ చేస్తున్నారు.