Watch Video: పక్కన పాప ఉందని రెచ్చిపోయాడు.. కట్ చేస్తే మైండ్ బ్లాంక్ ట్విస్ట్.. దెబ్బకు దెయ్యం వదిలింది..!

|

May 02, 2023 | 10:21 AM

ఈ మధ్య కాలంలో ప్రేమికులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. పబ్లిక్ ప్లేసెస్ అనే సోయి కూడా లేకుండా శృతిమించి రొమాన్స్ చేస్తున్నారు. ముఖ్యంగా అబ్బాయిలు తమ ప్రేయసిని బైక్ ముందు భాగాన కూర్చొబెట్టుకుని డ్రైవింగ్ చేయడం, విచ్చలవిడిగా ప్రవర్తించడం పరిపాటిగా మారింది. దేశ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు చాలానే వెలుగు చూశాయి.

Watch Video: పక్కన పాప ఉందని రెచ్చిపోయాడు.. కట్ చేస్తే మైండ్ బ్లాంక్ ట్విస్ట్.. దెబ్బకు దెయ్యం వదిలింది..!
Lovers Caught
Follow us on

ఈ మధ్య కాలంలో ప్రేమికులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. పబ్లిక్ ప్లేసెస్ అనే సోయి కూడా లేకుండా శృతిమించి రొమాన్స్ చేస్తున్నారు. ముఖ్యంగా అబ్బాయిలు తమ ప్రేయసిని బైక్ ముందు భాగాన కూర్చొబెట్టుకుని డ్రైవింగ్ చేయడం, విచ్చలవిడిగా ప్రవర్తించడం పరిపాటిగా మారింది. దేశ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు చాలానే వెలుగు చూశాయి. తాజాగా అలాంటి ఘటనే బిలాస్ పూర్‌లో వెలుగు చూసింది. అయితే, ఈ ప్రేమ జంట వ్యవహారాన్ని పోలీసులు సీరియస్ తీసుకున్నారు. ప్రేయసిని బైక్‌పై ఎక్కించుకుని డ్రైవ్ చేస్తూ డ్రైవింగ్ నిబంధనలను ఉల్లంఘించాడనే కారణంతో భారీ జరిమానా విధించారు పోలీసులు. అంతేకాదు.. స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

వివరాల్లోకెళితే.. ఛత్తీస్‌ఘడ్‌లోని బిలాస్‌పూర్‌లో అర్థరాత్రి 2 గంటల సమయంలో ఓ ప్రేమ జంట స్కూటీ చెక్కర్లు కొడుతోంది. సాధారణంగా డ్రైవింగ్ చేస్తే సమస్య లేదు. కానీ, అబ్బాయి స్కూటీ డ్రైవ్ చేస్తూ ప్రేయసిని తన ముందు భాగంలో కూర్చోబెట్టుకున్నాడు. అలా డ్రైవ్ చేస్తూ రొమాన్స్ చేశారు. అయితే, రోడ్డుపై వెళ్తున్న మిగతా ప్రయాణికులు.. వారి రాసలీలలను ఫోన్‌లో వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా క్షణాల్లో వైరల్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

ఆ వీడియో అటు ఇటు తిరిగి బిలాస్‌పూర్ ట్రాఫిక్ డీఎస్పీ కంట పడింది. ఇంకేముందు.. బైక్ నెంబర్ ఆధారంగా వివరాలను ట్రాక్ చేసి సదరు అబ్బాయిని పట్టుకున్నారు. స్టేషన్‌కి పిలిపించి.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ రూ. 8,800 చలాన్ విధించారు. మరోసారి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. మొత్తంగా ఆ అబ్బాయికి కౌన్సిలింగ్ ఇచ్చి.. అతనితో క్షమాపణలు చెప్పించి వదిలేశారు.

అయితే, ఈ ప్రేమ జంట రొమాన్స్‌ వీడియో సోషల్ మీడియాలో రచ్చ క్రియేట్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదెక్కడి ఆనందం రా అయ్యా అంటూ ఫైర్ అవుతున్నారు. తేడా వస్తే ప్రాణాలకే ప్రమాదం అని, ఇలాంటి ప్రయోగాలు చేయొద్దంటూ హితవు చెబుతుతన్నారు. ఈ వైరల్ వీడియోపై మీరూ ఓ లుక్కేసుకోండి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..