AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: అడవిలో అరుదైన పోరు.. రెండు ఎలుగుబంట్లను ఎదుర్కొన్న పులి! ఒళ్లుగగుర్పాటుకు గురి చేస్తున్న సీన్!

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వన్యప్రాణుల పోరాట వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. అడవిలో ఓ పులి, రెండు ఎలుగుబంట్ల మధ్య జరిగినట్లు కనిపిస్తున్న ఈ భీకర ఘర్షణ నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వీడియోలో మొదట పులి ఒంటరిగా ఒక ఎలుగుబంటితో తలపడుతుంది. తన వేగం, బలంతో ఎలుగుబంటిపై విరుచుకుపడిన పులి దానిని నేలకేసి పడేసినట్లు కనిపించింది.

Watch: అడవిలో అరుదైన పోరు.. రెండు ఎలుగుబంట్లను ఎదుర్కొన్న పులి! ఒళ్లుగగుర్పాటుకు గురి చేస్తున్న సీన్!
Tiger Bears Battle
Balaraju Goud
|

Updated on: Jul 21, 2026 | 3:28 PM

Share

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వన్యప్రాణుల పోరాట వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. అడవిలో ఓ పులి, రెండు ఎలుగుబంట్ల మధ్య జరిగినట్లు కనిపిస్తున్న ఈ భీకర ఘర్షణ నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వీడియోలో మొదట పులి ఒంటరిగా ఒక ఎలుగుబంటితో తలపడుతుంది. తన వేగం, బలంతో ఎలుగుబంటిపై విరుచుకుపడిన పులి దానిని నేలకేసి పడేసినట్లు కనిపించింది. అయితే ఎలుగుబంటి కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన శక్తివంతమైన పంజాలతో ఎదురుదాడి చేసింది. కొద్దిసేపు ఇద్దరి మధ్య హోరాహోరీ పోరాటం సాగుతుంది.

అయితే పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది. మరో ఎలుగుబంటి అకస్మాత్తుగా అక్కడికి చేరుకుని పులిపై దాడి చేయడంతో పోరాటం మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది. రెండు ఎలుగుబంట్లు కలిసి పులిని చుట్టుముట్టి దాడి చేయడానికి ప్రయత్నించాయి. పులి తప్పించుకోవడానికి పలుమార్లు ప్రయత్నించినా, అవి దానిని వెంబడిస్తూనే ఉన్నాయి. వీడియోలో పులి పలుమార్లు కిందపడినా మళ్లీ లేచి తనను తాను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది. చివర్లో పులి నేలపై పడిపోయినట్లు కనిపించగా, రెండు ఎలుగుబంట్లు అక్కడి నుంచి వెళ్లిపోతాయి.

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు దీనిని అడవిలో అరుదుగా కనిపించే వన్యప్రాణుల పోరాటంగా పేర్కొంటుండగా, మరికొందరు వీడియో ప్రామాణికతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పులి కదలికలు సహజంగా లేవని, కొన్ని సన్నివేశాలు కృత్రిమంగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు ఈ వీడియోను కృత్రిమ మేధస్సు (AI) సాయంతో రూపొందించి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. అంత సుదీర్ఘంగా పోరాటం జరిగినా రక్తపు జాడలు కనిపించకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది.

అయితే ఈ వీడియో ఎక్కడ చిత్రీకరించారు? ఎప్పుడు జరిగింది? అనే విషయాలపై ఎలాంటి అధికారిక సమాచారం అందుబాటులో లేదు. అలాగే వీడియో నిజమైనదా, ఎడిట్ చేసినదా, లేక AI సాయంతో రూపొందించినదా అనే అంశంపై కూడా స్వతంత్రంగా నిర్ధారణ కాలేదు. అందువల్ల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇలాంటి వీడియోలను పూర్తిగా నిజమని నమ్మే ముందు వాటి ప్రామాణికతను పరిశీలించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!