Viral Video: భారీ ఉడుమును అమాంతం మింగేందుకు యత్నించిన కళింగ పాము.. చివరకు

|

Sep 12, 2022 | 12:37 PM

కళింగ పామును కింగ్ కోబ్రా అంటారు. ఇది చాలా పొడవుగా, పెద్ద సైజ్‌లో ఉంటుంది. ఇది కానీ కాటు వేస్తే... బ్రతికే ఛాన్సులు చాలా తక్కువ.

Viral Video: భారీ ఉడుమును అమాంతం మింగేందుకు యత్నించిన కళింగ పాము.. చివరకు
King Cobra
Follow us on

Trending Video: కళింగ పాములు చాలా అరుదుగా కనిపిస్తాయి.  పాముల్లో కింగ్‌గా దీనికి పేరుంది. ఈ జాతి పాములు ప్రాంతాలకు సమీపంలో సంచరిస్తూ ఉంటాయి. ఇవి చాలా డేంజరస్. చాలా పొడవుగా ఉంటాయి. కర్ణాటక(Karnataka)లో ఇవి తరచుగా కనిపిస్తాయి. తాజాగా బాగా ఆకలితో ఉన్న ఓ భారీ కళింగ పాము.. ఓ ఉడుమును వేటాడింది. మాటు వేసి దాన్ని పట్టేసింది. అయితే దాన్ని మింగేందుకు మాత్రం ఆపసోపాలు పడింది. కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. సిర్సి సమీపంలో యానా క్రాస్ రోడ్డు సమీపంలోని ఓ మరుగు ప్రాంతంలో ఉడుపును నోటబట్టిన సర్పం.. దాన్ని మింగేందుకు దాదాపు గంటపాటు విశ్వప్రయత్నం చేసింది. అయితే ఉడుము సైజ్ కూడా పెద్దదిగా ఉండటంతో.. అలిమి కాక చివరికి దాన్ని వదిలిపెట్టింది. అయితే అప్పటికే ఊపిరాడక ఉడుము మరణించింది. ఈ షాకింగ్ దృశ్యాలను అటుగా వెళ్లే బైక్ రైడర్ ఫోన్‌లో షూట్ చేశాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. వైరల్‌గా మారాయి. 

 

 

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి