Watch: దొంగలు బాబోయ్ దొంగలు.. చేతిలో కొండచిలువ పట్టుకుని చోరీకి యత్నం..! సీసీ ఫుటేజ్‌ వైరల్‌..

దొంగలు పట్టపగలు దొంగతనం చేయడానికి రకరకాల ఉపాయాలు వేస్తుంటారు. ఇతరుల కంటపడకుండా వాళ్ల టార్గెట్‌ పూర్తి చేస్తుంటారు. సరిగ్గా అలాంటి ఓ చోరీ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విలువైన CBD ఆయిల్‌ని దొంగిలించడానికి కొండచిలువలను ఉపయోగించారు. సీసీటీవీలో రికార్డైన ఈ సంఘటనలో దొంగలు పాములతో అక్కడున్న వ్యక్తి దృష్టి మరల్చి దొంగతనానికి ప్రయత్నించారు. ఆ తరువాత ఏం జరిగిందో చూపించే వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Watch: దొంగలు బాబోయ్ దొంగలు.. చేతిలో కొండచిలువ పట్టుకుని చోరీకి యత్నం..! సీసీ ఫుటేజ్‌ వైరల్‌..
Us Gas Station

Updated on: Mar 30, 2025 | 9:11 PM

అమెరికాలోని టేనస్సీలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో దొంగలు తెగబడ్డారు. దొంగలు కొండచిలువలను ఉపయోగించి CBD నూనెను దొంగిలించడానికి ప్రయత్నించారు. సీసీటీవీ ఫుటేజీలో రికార్డైన దృశ్యాల ఆధారంగా ముందుగా అక్కడి షాపులో ఉన్న క్యాషియర్‌తో ఎదురుగా ఒక మహిళ మాట్లాడుతోంది. అంతలోనే అక్కడికి మరో వ్యక్తి వచ్చాడు.. అతని చేతిలో చుట్టగా చుట్టిన ఒక కొండచిలువను రెండు చేతులతో పట్టుకుని ఉన్నాడు. ఆ వ్యక్తి కెమెరా ఫ్రేమ్ బయటకు ఉన్నాడు. కానీ, చేతిలో ఉన్న కొండచిలువ మాత్రం స్పష్టం కనిపిస్తోంది.

క్యాషీయర్‌తో మాట్లాడుతూ అతను మాట్లాడుతూ అతను ఆ కొండచిలువను కౌంటర్ మీద పెట్టాడు. దాంతో ఆ క్యాషియర్ అదంతా ఫోటోలు తీసే ప్రయత్నం చేయడంతో వారు క్యాషియర్ నుండి మొబైల్ ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నిస్తారు, కానీ క్యాషియర్ ఆ దొంగల నుండి తన ఫోన్‌ను కాపాడుకున్నాడు. అంతలోనే వీడియోలో మూడవ వ్యక్తి మరో కొండచిలువను చేతిలో పట్టుకుని కౌంటర్ మీద విసిరేయడం కూడా కనిపిస్తుంది. అయితే, ఆ తర్వాత వచ్చిన దృశ్యాలు సీసీటీవీ వీడియోలో లేవు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

కానీ, అంతలోనే క్యాషియర్ పోలీసులకు సమాచారం అందించాడని తెలిసింది. దాంతో ఆ దొంగలు ఎలాంటి అక్కడ్నుంచి పారిపోయారని తెలిసింది. చోరీ కోసమే వారు పాములను గ్యాస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని పోలీసులు నిర్ధారించారు. అయితే, ఏదైనా దొంగిలించారా అనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలాగే చాలా మంది ఆ వీడియోను రీషేర్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..