పోలీసులంటే నేరస్తులను హడలెత్తించడమే కాదు.. వివిధ కళల్తో తమ సత్తా చాటుతున్నారు. ముంబైకి చెందిన అమోల్ యశ్వంత్ కాంబ్లే అనే 38 ఏళ్ల పోలీస్ అధికారికి చెందిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదిరేటి స్టెప్టులతో అందరిని ఆకట్టుకున్నాడు కాంబ్లే. అమోల్ యశ్వంత్ కాంబ్లే నైగావ్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేస్తున్నాడు. ఉద్యోగంతోపాటు కాంబ్లేకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. తన డ్యాన్స్‌కు సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. ‘అప్పు రాజా’ చిత్రంలోని ‘ఆయా హై రాజా’ పాటకు స్టెప్పులేసి వారెవ్వా అనిపించారు. ఈ వీడియో ఇంటర్నెట్లో వైరలవ్వడంతో వేలల్లో లైకులు, కామెంట్లు వస్తున్నాయి. వీడియో చేయడం వెనుక సామాజిక కోణం కూడా ఉందని కాంబ్లే తెలిపారు. డ్యూటీలో ఉన్న ఉన్న పోలీసు ఉద్యోగి.. మాస్క్ ధరించని టూ వీలర్ వ్యక్తికి మాస్క్ ధరించమని చెప్పే థీమ్‌తో ఈ డ్యాన్ చేశామని, ఉద్ధేశ్యంతోనే ఇద్దరం కలిసి డ్యాన్స్ చేశామని వెల్లడించారు. కాగా మాహిమ్ ప్రాంతంలో నివాసముంటున్న కాంబ్లే 2004 లో పోలీస్ శాఖలో చేరాడు. అయితే ఈ పోలీస్ అధికారికి చిన్నప్పటి నుంచే డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టమట. ఎన్నో స్టేజులమీద ప్రదర్శనలు కూడా ఇచ్చారట. తన డ్యాన్ టాలెంట్‌పై కాంబ్లే స్పందిస్తూ..‘ మా బ్రదర్ కొరియోగ్రాఫర్.. పోలీస్ జాబ్‌లో చేరేముందు తనతో కలిసి కొన్ని డ్యాన్స్ షోలు చేశాను. ఇప్పుడు కూడా వీక్లీ ఆఫ్‌లు, ఖాళీ సమయాల్లో డ్యాన్స్ చేస్తుంటాను.’ అని వెల్లడించాడు.
వీడియో దిగువన వీక్షించండి
Also Read: బట్టలు ఆరవేసే వైర్లకు కరెంట్.. షాక్ కొట్టి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
సయ్యాట ఆడుతున్న పాములను విడదీశారు.. ఆ తర్వాత అసలు సీన్ స్టార్టయ్యింటి