Accused imitates Allu Arjun : ఏప్రిల్ 17, 2022, ఆదివారం నాడు ఢిల్లీ(Delhi)లోని జహంగీర్‌పురిలో జరిగిన హనుమాన్ జయంతి(Hanuman Jayanti) ఊరేగింపులో హింసకు సంబంధించిన కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు అన్సార్ ప్రజంట్ పోలీసుల అదుపులో ఉన్నాడు. కాగా ఇతడిని కోర్టుకి తీసుకువెళ్తుండగా.. తెలుగు సూపర్ హిట్ మూవీ పుష్ప: ది రైజ్‌లోని సిగ్నేచర్ మూమెంట్ అనుసరించి మీడియా దృష్టిని ఆకర్షించాడు. మూవీలోని అల్లు అర్జున్ ‘ఝుకేగా నహీ'( తగ్గేదే లే) సిగ్నేచర్ మూమెంట్ ఫాలో అవుతూ… గడ్డాన్ని దువ్వుతూ మీడియా కెమెరాలకు ఫోజ్ ఇచ్చాడు. పోలీసులు అతన్ని కోర్టు లోపలికి తీసుకువెళుతున్నప్పుడు నవ్వుతూ కనిపించాడు. ప్రజంట్ ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది.
వీడియో చూడండి…
#WATCH | Accused in Jahangirpuri violence case being taken to Rohini court pic.twitter.com/UZZPobYZ4n
— ANI (@ANI) April 17, 2022
వాయువ్య ఢిల్లీలో హనుమాన్ జయంతి రోజున శోభా యాత్ర సందర్భంగా చెలరేగిన మత హింసకు సంబంధించి అరెస్టయిన 21 మందిలో అన్సార్ కూడా ఉన్నారు. హింసాత్మక ఘటనలకు సంబంధించి పలువురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, రెండు ఊరేగింపులు ఆ ప్రాంతం గుండా వెళ్ళిన తరువాత, మూడవ ఊరేగింపును అన్సార్, అతని సహాయకులు ఆపివేశారు. ఊరేగింపును అడ్డుకునేలా అన్సార్ ప్రజలను రెచ్చగొట్టి, రాళ్లు రువ్వేలా చేసినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. అన్సార్‌ను విచారిస్తున్నామని, అతని కాల్ రికార్డులను కూడా తనిఖీ చేస్తున్నామని పోలీసు అధికారి తెలిపారు. అందుతున్న సమాచారం ప్రకారం అరెస్టయిన వారి నుంచి మూడు తుపాకులు, ఐదు కత్తులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉషా రంగాని తెలిపారు.
అన్సార్‌పై గతంలో రెండు దాడి కేసుల్లో ప్రమేయం ఉందని, ప్రివెంటివ్ సెక్షన్ల కింద చాలాసార్లు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గ్యాబ్లింగ్, ఆయుధ చట్టం కింద ఐదుసార్లు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Also Read: Andhra Pradesh: చిన్నారిపై చేతబడి..! అక్కడ వణుకుపుట్టిస్తున్న విచిత్ర ముగ్గు..