Viral Video: మిత్రుడి మరణం.. ఈ ఏనుగు పడిన బాధ చూస్తే మీరు సైతం కన్నీళ్లు పెడతారు

సృష్టిలో తీయనిది స్నేహమేనోయి అంటారు. సమాజంలో స్నేహబంధానికి ఉన్న ప్రత్యేకతే వేరు. ఎలాంటి సందర్భంలోనైనా అండగా నిలిచేది స్నేహబంధం మాత్రమే. మిత్రుల కోసం ప్రాణాలను సైతం పణంగా పెడతారు కొందరు. అలాంటి మిత్రులు దూరమైనప్పుడు ప్రాణమే విడిచిపోయినట్టుగా బాధపడతారు. ఇది మనుషుల్లేనేకాదు.. పశుపక్ష్యాదుల్లోనూ ఉంటుంది. ఓ ఏనుగు తన సహచర ఏనుకు చనిపోవడంతో కన్నీరు పెడుతూ... మిత్రమా లే.. ఆలస్యమవుతుంది వెళ్దాం అన్నట్టుగా ఆ ఏనుగును తట్టి లేపుతూ కన్నీరు పెడుతోంది. ఈ ఘటన అక్కడున్నవారందరినీ కంటతడి పెట్టించింది. ఈ ఘటన రష్యాలోని ఓ సర్కస్‌లో చోటుచేసుకుంది.

Viral Video:  మిత్రుడి మరణం.. ఈ ఏనుగు పడిన బాధ చూస్తే మీరు సైతం కన్నీళ్లు పెడతారు
Elephant (Representational image)

Updated on: Mar 15, 2025 | 5:15 PM

పాతికేళ్ల పాటు తనతో కలిసి ఉన్న స్నేహితుడి మరణంతో ఆ ఏనుగు కంటతడిపెడుతూ మూగగా రోదించింది. చనిపోయిన ఏనుగును లేపేందుకు విశ్వప్రయత్నం చేసింది. మీదపడి కన్నీరు పెడుతూ దాని దగ్గరికి ఎవరినీ రానివ్వలేదు. ఇది చూసి సర్కస్ సిబ్బంది కూడా కన్నీటిపర్యంతమయ్యారు. రష్యాలోని ఓ సర్కస్ కంపెనీలో చోటుచేసుకున్న ఈ ఘటనను సిబ్బంది రికార్డు చేసి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇప్పుడు ఈ వీడియో నెటిజన్లను సైతం కంటతడి పెట్టిస్తోంది. ఏనుగు కంటతడి చూసి నెటిజన్లు కూడా విషాదం వ్యక్తం చేస్తున్నారు. మనుషుల్లానే మూగ జంతువుల్లోనూ అనుబంధాలు, అప్యాయతలు ఉంటాయని ఈ ఘటన చాటిచెబుతోందని కామెంట్లు పెడుతున్నారు.

రష్యాలోని ఓ సర్కస్ కంపెనీలో రెండు ఏనుగులు రకరకాల ఫీట్లు చేస్తూ జనాలను ఆకట్టుకునేవి. సర్కస్ సిబ్బంది వాటికి జెన్నీ, మాగ్డా అని పిలుచుకునేవారు. పాతిక సంవత్సరాలకు పైగా జెన్నీ, మాగ్డా అదే సర్కస్ లో కలిసి ఉన్నాయి. ఇటీవల అనారోగ్యంతో జెన్నీ మరణించింది. కాసేపటికి జెన్నీ దగ్గరికి వచ్చిన మాగ్డా.. తన తొండంతో జెన్నీని లేపేందుకు ప్రయత్నించింది. జెన్నీ కదలకపోవడంతో మీదపడి కన్నీరు పెట్టుకుంది. చాలాసేపటి వరకు జెన్నీ దగ్గరకు ఎవరినీ రానివ్వలేదు. జెన్నీ మృతకళేబరం చుట్టూ తిరుగుతూ, కన్నీరు కారుస్తూ తనను పైకి లేపేందుకు మాగ్డా చేసిన ప్రయత్నాలు చూసి సర్కస్ సిబ్బంది కన్నీటిపర్యంతమయ్యారు.

వీడియో దిగువన చూడండి….

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..