Monsoon Prediction: గుడ్లలో దాగిన వర్ష రహస్యం.. ఈ పక్షి చెప్పిందే ప్రకృతి నిర్ణయం!
వర్షం ఎప్పుడు వస్తుంది, రేపటి వాతావరణం ఎలా ఉండబోతుంది అనే విషయాలను తెలుసుకునేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లోని ప్రజలు అత్యాధునిక సాంకేతికత కలిగిన యాప్స్‌ను వాడుతుంటే.. మధ్యప్రదేశ్ లోని వింధ్య ప్రాంత గ్రామాల్లోని కొందరు రైతులు మాత్రం ఇప్పటికీ వాతావరణాన్ని అంచనా వేయడానికి ఒ చిన్న పిట్టను ఫాలో అవుతన్నారు. అవును వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.

ఈ ప్రాంతంలో నివసించే ప్రజలు తరతరాలుగా వర్షాకాలం ఎప్పుడు వస్తుందో తెలుసుకోవడానికి లాఫ్‌వింగ్ అనే పక్షి అవాట్లను ఫాలో అవుతూ వస్తున్నారు. ఈ పక్షి గూడు కట్టుకునే అలవాట్లను, అది పెట్టే గుడ్లను పట్టి వీళ్లు వాతావరణాన్ని అంచనా వేస్తారు. ఆధునిక వాతావరణ శాస్త్రం ఉపగ్రహాలు, రాడార్లు, సంక్లిష్టమైన క్లైమేట్ మోడల్స్‌పై ఆధారపడితే ఈ రోజుల్లో కూడా శతాబ్దాల నాటి సంప్రదాయం అనుసరిస్తూ ఈ ప్రాంత ప్రజలు ప్రకృతి ప్రత్యేకతను చాటుతున్నారు.
ఒక పక్షి వర్షాన్ని ఎలా అంచనా వేయగలదు?
స్థానిక నమ్మకాల ప్రకారం.. లాప్‌వింగ్ పక్షి పెట్టే గుడ్లు రాబోయే వర్షాకాలం తీవ్రతను, సరళిని తెలియజేస్తాయి. ఈ పక్షి సాధారణంగా నాలుగు గుడ్లు పెడుతుంది. అక్కడి గ్రామస్తులు ఈ నాలుగు గుడ్లను నాలుగు నెలలతో పోలుస్తారు. ఒక్కో గుడ్డు ఒక్క నెలలో కురిసే వర్షాన్ని సూచిస్తుందని వీరు నమ్ముతారు. స్థానికంగా ఉండే ఓ రైతు తెలిపిన వివరాల ప్రకారం..తాము ఈ పద్దతిని మూడ నమ్మకంగా కాకుండా.. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ పర్యావరణ జ్ఞానంగా భావిస్తామని తెలిపారు. తమ పూర్వికులు ఎన్నో ఏళ్లుగా పక్షుల ప్రవర్తనను నిశితంగా గమనించి ఈ మార్పులను తెలుసుకున్నారని తెలిపారు.
గుడ్లు పెట్టే స్థలం కూడా ముఖ్యమే!
అయితే ఈ పక్షి గుడ్లు ఎక్కడ పెడుతుందనేది కూడా చాలా ముఖ్యమని స్థానికులు చెబుతున్నారు. ఈ పక్షి ఎత్తైన ప్రాంతం లేదా కొండ ప్రాంతాల్లో గుడ్లు పెడితే ఆ ఏడా భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉందని వారు నమ్ముతారు. ఎందుకంటే భారీ వర్షాల కారణంగా వచ్చే వరద నుంచి తన గుడ్లను కాపాడుకోవడానికి ఈ పక్షి ఎత్తైన ప్రాంతాల్లో గుడ్లు పెడుతుందని వారి నమ్మకం. ఒక వేళ గుడ్లను పల్లపు లేదా మైదాన ప్రాంతాలలో పెడితే, ఆ సీజన్‌లో రుతుపవనాలు బలహీనంగా ఉంటాయని, వర్షాలు కూడా తక్కువగానే కురుస్తాయని నమ్ముతారు.
గుడ్ల ఆకారం ఏం చెబుతుంది?
అయితే ఈ పక్షి పెట్టే గుడ్ల ఆకారం, అది ఏదిశలో గుడ్లను పెడుతుందనే దానికి కూడా ప్రత్యేకత ఉందట. గుడ్ల మొనలు కిందికి ఉంటే, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే గుడ్లు ఏ దిశలో ఉన్నాయో, దాన్ని బట్టి వచ్చే రుతుపవనాల మార్గాన్ని, వీచే గాలుల దిశను అంచనా వేస్తారు. ఈ పద్ధతులు శాస్త్రీయ వాతావరణ అంచనాలో భాగం కానప్పటికీ, వ్యవసాయం చేసేందుకు ఎన్నో ఏళ్లుగా వర్షాల కోసం ఎదురుచూసే చాలా మంది రైతులు వీటిని నమ్ముతూ వస్తున్నారు.
లాప్‌వింగ్ పక్షి గురించిన విశేషాలు
లాప్‌వింగ్ పక్షి తేలికపాటి గోధుమ, తెలుపు రంగు ఈకలను కలిగి ఉండి, దాని కళ్ళు, ముక్కు దగ్గర ప్రత్యేకమైన ఎరుపు రంగు మార్కింగ్‌తో గుర్తింపు పొందింది. ఈ పక్షి సాధారణంగా మే నెలలో ఎక్కువగా గుడ్లు పెడుతుంది. గుడ్లు సాధారణంగా 28 నుండి 30 రోజులలోపు పిల్లలవుతాయి. వింధ్య ప్రాంతంలోని సత్నా, రేవా, సిద్ధి, సింగ్రౌలి, పన్నా జిల్లాల్లోని బహిరంగ మైదానాలు, నదీ తీరాలు, చెరువుల దగ్గర ఇవి ఎక్కవగా కనిపిస్తాయి. లాప్‌వింగ్ పక్షులు సాధారణ గూళ్లను నిర్మించవు. అవి ఎప్పుడూ రాళ్లు, గులకరాళ్ల మధ్య నేరుగా నేలపైనే గుడ్లు పెడతాయి. అందువల్ల వీటిని గుర్తించడం చాలా కష్టం. ఈ సమయంలో ఇవి చాలా అప్రమత్తంగా ఉంటాయి. ఎవరైనా వాటి గుడ్ల దగ్గరకు వస్తే గట్టిగా అరుస్తూ హెచ్చరిస్తాయి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




