Viral Video: కొండల్లో వేగంగా ప్రవాహిస్తున్న నీరు.. రాళ్ల మధ్య చిక్కుకున్న కారు.. తర్వాత ఏం జరిగిదంటే..

|

Oct 19, 2021 | 10:29 AM

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలతో చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఓ చోట కొండచరియలు విరిగి పడి అందులో కారు చిక్కుకుంది...

Viral Video: కొండల్లో వేగంగా ప్రవాహిస్తున్న నీరు.. రాళ్ల మధ్య చిక్కుకున్న కారు.. తర్వాత ఏం జరిగిదంటే..
Car
Follow us on

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలతో చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఓ చోట కొండచరియలు విరిగి పడి అందులో కారు చిక్కుకుంది. కారును బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) సురక్షితంగా బయటకు లాగింది. దీంతో అందులో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కారు రెండు బండరాళ్ల మధ్య ప్రమాదకరంగా చిక్కుకుంది. రాళ్ల మధ్యలోంచి వేగంగా నీటి ప్రవాహాలు రావటంతో వారిని కాపాడటం కష్టమైంది. ఈ ఘటన సోమవారం బద్రీనాథ్ జాతీయ రహదారి సమీపంలో స్వోలెన్ లంబగడ్ నల్లా వద్ద జరిగింది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్‎ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్‎గా మారింది.

ఉత్తరాఖండ్‎లో కురుస్తున్న భారీ వర్షాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ ధామి, మంత్రి అజయ్ భట్‌తో మాట్లాడారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ వానలతో నేపాల్‌కు చెందిన ముగ్గురు కూలీలతో సహా ఐదుగురు మరణించారు. వాతావరణం మెరుగుపడే వరకు హిమాలయాల దేవాలయాలకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. చంపావత్ జిల్లాలోని సెల్ఖోలాలో కొండచరియలు విరిగిపడటంతో వారి ఇల్లు కూలిపోయి ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ సెంటర్ తెలిపింది.

రిషికేశ్‌లోని చంద్రభాగ వంతెన, తపోవన్, లక్ష్మణ్ జూలా, ముని-కి-రేతి భద్రకాళి రోడ్లను దాటడానికి ప్రయాణికుల వాహనాలను అధికారులు అనుమతించలేదు. యాత్రికులు వాతావరణం సాధారణమయ్యే వరకు రెండు రోజుల పాటు తమ ప్రయాణాన్ని వాయిదా వేయాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1వ తరగతి నుండి 12 వ తరగతి వరకు అన్ని పాఠశాలలు సోమవారం మూసివేశారు. నంద దేవి బయోస్పియర్ రిజర్వ్, వివిధ అటవీ విభాగాలతో సహా రాష్ట్రంలోని ఎత్తైన ప్రాంతాల్లో ట్రెక్కింగ్, పర్వతారోహణ, క్యాంపింగ్ కార్యకలాపాలపై నిషేధం విధించారు.

Read Also.. Viral Video: 84 ఏళ్ల వయస్సులో విమానం నడిపిన వృద్ధురాలు.. చివరి కోరిక నెరవేర్చిన కొడుకు.. వీడియో వైరల్..