వీడో మంచి దొంగ.. ‘బామ్మకు ముద్దు-డబ్బులు వద్దు’

బ్రెజిల్‌లో జరిగిన ఓ దొంగతనం వైరల్‌గా మారింది. మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఓ ఫార్మసీలోకి చొరబడిన ఇద్దరు దొంగలు.. వ్యాపారిని గన్‌తో బెదిరిస్తూ డబ్బులు, వస్తువులు దోచుకున్నారు.  అయితే, ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ వృద్ధ కస్టమర్ దొంగలకు భయపడి తన డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించింది. అయితే, వారిలో ఒక దొంగ అందుకు నిరాకరించాడు. ‘నాకు డబ్బులు వద్దు మేడమ్..దయచేసి సెలెంట్‌గా ఉండండి’  అంటూ ఆమె నుదుటి మీద ముద్దుపెట్టి వెళ్లిపోయాడు. ఇదంతా […]

వీడో మంచి దొంగ.. బామ్మకు ముద్దు-డబ్బులు వద్దు

Edited By:

Updated on: Oct 19, 2019 | 6:34 AM

బ్రెజిల్‌లో జరిగిన ఓ దొంగతనం వైరల్‌గా మారింది. మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఓ ఫార్మసీలోకి చొరబడిన ఇద్దరు దొంగలు.. వ్యాపారిని గన్‌తో బెదిరిస్తూ డబ్బులు, వస్తువులు దోచుకున్నారు.  అయితే, ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ వృద్ధ కస్టమర్ దొంగలకు భయపడి తన డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించింది. అయితే, వారిలో ఒక దొంగ అందుకు నిరాకరించాడు. ‘నాకు డబ్బులు వద్దు మేడమ్..దయచేసి సెలెంట్‌గా ఉండండి’  అంటూ ఆమె నుదుటి మీద ముద్దుపెట్టి వెళ్లిపోయాడు.

ఇదంతా షాప్‌లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది.  దాంతో ఆ దృష్యాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఈ ఘటనలో దొంగలు రూ.71,155, దుకాణంలోని కొన్ని వస్తువులను దొంగలించారని షాప్ ఓనర్ శామ్యూల్ అల్మిదా తెలిపాడు. వాళ్లు ఎవరికీ హాని చేయకుండా వెళ్లడం సంతోషకరమని, వారిని పోలీసులకు పట్టించేందుకు మరో సీసీటీవీని వీడియోను కూడా పరిశీలిస్తున్నామని శామ్యూల్ అన్నాడు.