Viral: అరె ఏంట్రా ఇది.. పెళ్లి పీటల మీదే రెచ్చిపోయిన జంట.. నెటిజన్ల రియాక్షన్ మామూలుగా లేదుగా..

పెళ్లి వేడుక.. అటు వధూవరులు.. ఇటు బంధుమిత్రులు.. సందడి సందడిగా ఉంది.. వరుడు.. వధువు చూడముచ్చటగా ఉన్నారు.. వివాహ క్రతువు ప్రారంభమైంది. పెళ్లిపీటలపై వధూవరులిద్దూ కూర్చున్నారు.. పెళ్లి తంతు మరికాసేపట్లో ముగుస్తుందనగా.. షాకింగ్ సన్నివేశం చోటుచేసుకుంది.. ఉన్నట్టుండి ఈ జంట ఏకంగా లిప్ లాక్ తో పెళ్లి వేదిక పైనే రెచ్చిపోయారు..

Viral: అరె ఏంట్రా ఇది.. పెళ్లి పీటల మీదే రెచ్చిపోయిన జంట.. నెటిజన్ల రియాక్షన్ మామూలుగా లేదుగా..
Viral Wedding

Updated on: Mar 16, 2026 | 1:20 PM

పెళ్లి వేడుక.. అటు వధూవరులు.. ఇటు బంధుమిత్రులు.. సందడి సందడిగా ఉంది.. వరుడు.. వధువు చూడముచ్చటగా ఉన్నారు.. వివాహ క్రతువు ప్రారంభమైంది. పెళ్లిపీటలపై వధూవరులిద్దూ కూర్చున్నారు.. పెళ్లి తంతు మరికాసేపట్లో ముగుస్తుందనగా.. షాకింగ్ సన్నివేశం చోటుచేసుకుంది.. ఉన్నట్టుండి ఈ జంట ఏకంగా లిప్ లాక్ తో పెళ్లి వేదిక పైనే రెచ్చిపోయారు.. అందరూ చూస్తుండగానే ముద్దు పెట్టుకోవడంతో బంధుమిత్రులు విస్తుపోయారు. దీనికి సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. అయితే.. ఇది ఆన్‌లైన్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. కొంతమంది దీనిని వ్యక్తిగత ప్రేమ క్షణంగా చూసినప్పటికీ, చాలా మంది ఈ చర్యను విమర్శిస్తున్నారు. ఇటువంటి బహిరంగ ప్రదర్శనలు హిందూ వివాహ ఆచారాల సాంప్రదాయ పవిత్రతకు విరుద్ధంగా ఉన్నాయని.. పాశ్చాత్య పోకడలు తగదంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

బెంగాలీ వివాహ వేడుకలో ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు, అతిథుల ముందు వివాహ వేడుక సందర్భంగా చిత్రీకరించబడిన 35 సెకన్ల ఈ వైరల్ క్లిప్‌లో.. వధూవరులు వేదికపై సన్నిహితంగా ముద్దు పెట్టుకుంటున్నట్లు చూపిస్తుంది. అందరిముందు వధూవరులు ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం ఆన్‌లైన్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. సాంప్రదాయ వేడుకలో ఇలాంటివి తగదని.. వివాహాల సమయంలో ఇవేం పనులు అంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బహిరంగ ప్రేమాభిమానాలు సముచితమేనని.. కానీ.. హద్దులు దాటకూడదని.. పేర్కొంటున్నారు.

వీడియో చూడండి..

సోషల్ మీడియా స్పందన

” పాస్టర్ “నువ్వు ఇప్పుడు వధువును ముద్దు పెట్టుకోవచ్చు” అని చెప్పినప్పుడు తెల్లవారు కూడా చాలా గౌరవంగా ఇలా చేస్తారు” అని ఒక యూజర్ వ్యాఖ్యానించాడు..

వేద ఆచారాలతో పెళ్లి చేసుకుని ఇలాంటి నీచమైన పనులకు పాల్పడటం ఎందుకు? మన సంప్రదాయాలను మనం అంతం చేసుకుంటున్నాం.. అని మరో యూజర్ పేర్కొన్నాడు..

“ఇది చూడండి. వారు తమ పెళ్లిలో తల్లిదండ్రులు/తాతామామలతో సహా అందరి ముందు ఇలా చేస్తున్నారు. హిందూ వివాహాలకు ఒక పవిత్రత ఉండేది. ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత వివాహాలలో జంటలు ఏమి చేస్తారో ఊహించుకోండి. ఎవరైనా దీనిని సమర్థిస్తారా..” అంటూ మరొకరు పేర్కొన్నారు.

అయితే.. మరికొంతమంది వారికి సపోర్ట్ చేస్తూ కామెంట్లు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా ఇలాంటి కల్చర్ తగదంటూ మరికొందరు వారిపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Follow Us