
ప్రతి ఒక్కరూ తమ వివాహం ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా శుభలేఖలు కూడా అందరికంటే డిఫరెంట్‌గా ఉండాలని ఆశపడతారు. అది డిజైన్, కలర్‌లో అయితే ఓకే కాని.. ఈ పెళ్లి కొడుకు చూడండి ఎంత విచిత్రమైన కార్డు కొట్టించాడో. పెళ్లికి తాను కట్నం తీసుకోవడం లేదని ఏకంగా శుభలేఖపైనే ప్రింట్ చేయించాడు. అలాగే పెళ్లిలో మద్యం, మాసం కూడా నిషేధించినట్లు రాయించాడు. దీంతో ఈ పెళ్లి కార్డు అందుకున్న వ్యక్తులు వివాహానికి వెళ్లాలా వద్దా అని ఆలోచించిస్తున్నారు. ప్రస్తుతం ఈ విచిత్రమైన పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అఫీషియల్ రాజ్ సిసోడియా అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఈ పోస్ట్‌లో వివాహ ఆహ్వాన కార్డును చూడవచ్చు. ఈ వివాహ కార్డు రాజస్థాన్‌లోని సికార్‌కు చెందిన అజిత్ సింగ్ షెకావత్ కుటుంబానికి చెందినది. సంగ్రామ్ సింగ్, పూజ కూడా నవంబర్ 2, 2025న వివాహం చేసుకోగా, మరో జంట యువరాజ్ సింగ్, హర్షిత రాథోడ్ నవంబర్ 7, 2025న వివాహం చేసుకోనున్నారు. ఈ జంట వివాహ ఆహ్వాన కార్డులో ఇది వరకట్న రహిత వివాహం అని, మాంసం, మద్యం నిషేధించబడిందని చెప్పడం చూడవచ్చు.
ప్రతి కుటుంబం ఇంత సాహసోపేతమైన అడుగు వేసి మద్యం, మాంసం లేకుండా వివాహాన్ని నిర్వహించాలని నెటిజన్లు ఈ పెళ్లి కార్డు చూసి కామెంట్లు చేస్తున్నారు. మరొకరు ఇది సమాజానికి మంచి సందేశం అని, ఈ విధంగా చేస్తే అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవచ్చునని వ్యాఖ్యానించారు. ఇది అమ్మాయి తల్లిదండ్రులు అప్పుల్లో మునిగిపోకుండా నివారిస్తుందని మరో నెటిజన్ పేర్కొన్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి