Viral Video: అక్కడికి ఎలా వచ్చావ్ మావ.. కంగుతిన్న ఫ్యామిలీ..

మావ.. మాములుగా బయట పాము కనిపిస్తేనే మనం ఆమడదూరం పరిగెడతాం.. అదే పాము మన ఇంట్లోకే వచ్చేస్తే.. ఇంకా చెప్పాలంటే మన బెడ్‌రూంలోకి వచ్చి బెడ్ ఎక్కేస్తే.. ఆపై దిండు కింద నక్కితే.. వామ్మో ఊహించుకుంటేనే భయం వేస్తుంది కదా..! కానీ ఈ ఘటన నిజంగానే జరిగింది.

Viral Video: అక్కడికి ఎలా వచ్చావ్ మావ.. కంగుతిన్న ఫ్యామిలీ..
Cobra

Updated on: May 31, 2025 | 10:04 AM

ఇంట్లో పనులన్నీ ముగించుకొని ఆ కుటుంబ సభ్యులంతా ఇక నిద్రపోవడానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి తన బెడ్‌రూమ్‌లోకి వెళ్లి మంచంపై కూర్చున్నాడు. ఇంతలో పక్కనే ఉన్న దిండుకింద ఏదో కదులుతున్నట్టు గుర్తించాడు. ఏమై ఉంటుందా అని చూసిన అతనికి ఒళ్లు జలదరించింది. భయంతో అక్కడినుంచి బయటకు పరుగుతీశాడు. అనంతరం కుటుంబ సభ్యులకు విషయం చెప్పాడు. అందరూ అక్కడికి వచ్చి దిండుకింద ఉన్న నాగుపామును చూసి షాకయ్యారు. వెంటనే స్నేక్‌ క్యాచర్‌కు సమాచారమిచ్చారు.

నాగ్‌పూర్‌లో ఓ ఇంట్లో దిండులో విషసర్పం దాగి ఉండటం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాత్రి వేళ బెడ్ రూంలో దిండులో సుమారు ఒక అడుగు పొడవున్న నాగుపాము కనిపించడంతో ఆ ఫ్యామిలీ కంగుతింది. దాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. విష సర్పం మొదట దిండు కింద కనిపించింది. తర్వాత మంచం కిందికి వెళ్లి దాగింది. స్నేక్ క్యాచర్ ఆ పామును జాగ్రత్తగా పట్టుకొని ప్లాస్టిక్ డబ్బాలో బంధించి.. ఆపై అటవీ ప్రాంతంలో వదిలేశాడని సమాచారం.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వేలాది మంది చూశారు. వీడియోలో సర్పం దిండులోని కోనలో దాక్కుని ఉండడం చూడవచ్చు. వామ్మో మరీ బెడ్ రూంలోకి వచ్చేస్తే మేం ఎలా బతకాలి మావ అంటూ నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.  వర్షాకాలంలో పాములతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

వీడియో దిగువన చూడండి..