వైరల్‌గా మారిన వీడియోలో ఓ చిన్న వీధిలో అటు ఇటూ ఇళ్లు ఉన్నాయి. మద్యలో చిన్న రోడ్డు ఉంది. ఎక్కడినుంచి వచ్చిందో ఆ వీధిలోకి ఓ పెద్ద నాగుపాము వచ్చింది. అది నల్లగా మెరుస్తూ చాలా పెద్దగా ఉంది. ఆ పామును చూసిన ఓ మహిళ అదెక్కడ తమ ఇళ్లలోకి చొరబడుతుందోనని భయపడి, ఓ పెద్ద కర్ర తీసుకొని దానిని బెదిరించే ప్రయత్నం చేసింది. దీంతో తన దారిన తాను పోతున్న ఆ నాగుపాము ఒక్కసారిగా మహిళ వైపు తిరిగి, నా మానాన నేను పోతుంటే నన్ను బెదిరిస్తావా.. నేను నీ ఇంట్లోకి అయితే రాలేదు కదా.. ఉండు నీపని చెప్తాను అన్నట్టుగా ఆ మహిళ వైపు వెళ్లసాగింది. ఇంతలో పక్కన ఇంట్లోంచి మరో మహిళ కర్రతీసుకొని వచ్చింది. ఈ వైపునుంచి ఈ మహిళ కూడా పామును బెదిరించడం మొదలు పెట్టింది.
ఇద్దరు మహిళలూ చెరోవైపున కర్రతో నేలపై కొడుతూ ఆ పామును బెదిరించారు. ఇలా రెండు వైపులా మహిళలు కర్రతో చప్పుడు చేస్తుండడంతో.. నా జోలికి వచ్చారో జాగ్రత్త అన్నట్టుగా .. పాము పడగ విప్పి వారిపై బుసలు కొట్టింది . ఈ వీడియో ఇంతటితో ముగిసింది. తర్వాత ఏం జరిగిందనేది తెలియరాలేదు. అయితే ఈ ఘటనను అక్కడున్నవారెరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అది నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘దారిన వెళ్లే పామును ఇంట్లోకి పిలవడం అంటే ఇదే’’.. అంటూ కొందరు, ‘‘వారు నాగుపామును బాధపెట్టాలని అనుకోలేదు.. వేరే ఇంట్లోకి వెళ్లాలని మాత్రమే అనుకుంటున్నారు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటికే లక్షమందికి పైగా వీక్షించారు. వెయ్యిమందికి పైగా లైక్ చేశారు.
వీడియో దిగువన చూడండి…
Kalesh b/w Aunties and a Cobra
pic.twitter.com/N7i7iytrto— Ghar Ke Kalesh (@gharkekalesh) December 11, 2024
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి