Viral Video: ఈ తిమింగలం వెరీ స్పెషల్ గురూ.. అడిగి మరీ ముద్దు పెట్టించుకుంటుంది..!

Viral Video: సాధారణంగా సముద్ర ప్రయాణం అంటేనే తెలియని భయం ఉంటుంది చాలామందిలో. అలల మధ్య వెళ్లాలంటే కొద్దిగా వణుకే..

Viral Video: ఈ తిమింగలం వెరీ స్పెషల్ గురూ.. అడిగి మరీ ముద్దు పెట్టించుకుంటుంది..!
Shark Kiss

Updated on: Mar 11, 2022 | 8:09 PM

Viral Video: సాధారణంగా సముద్ర ప్రయాణం అంటేనే తెలియని భయం ఉంటుంది చాలామందిలో. అలల మధ్య వెళ్లాలంటే కొద్దిగా వణుకే ఎవరికైనా. ఓవైపు అలల జోరు.. మరోవైపు సముద్రంలో ఉండే భారీ తిమింగలాలు.. అలాంటి తిమింగలాలు అమాంతం తినేయవా అంటే.. షార్క్‌ వంటి వాటినే గుట్టుక్కున మింగేస్తాయి.. మనుషులు ఓ లెక్కా వాటికి అని అనుకోవచ్చు. కానీ వాటి ప్రేమను ఎప్పుడైనా చూశారా.. చూడకపోతే ఇప్పుడు చూసేయండి.

ఈ వీడియోలో తిమింగలానికి ఎలా ముద్దు పెడుతున్నారో చూడండి. సముద్ర ప్రయాణానికి వెళ్లిన టూరిస్టులకు.. ఓ చోట వేల్‌ కనిపించింది. దాన్ని చూడ్డానికి ప్రయత్నిస్తుండగా.. ఒక్కసారిగా జనాలను సమీపించింది. అది తన మూతిని పైకి లేపి పెట్టింది. ఆ సమయంలో టూరిస్టులు తొలుత భయపడినా.. ఆ తరువాత ధైర్యం తెచ్చుకున్నారు. దాని అంతర్గత భావాలను అర్థం చేసుకుని ఏ మాత్రం భయపడకుండా.. దాన్ని నిరుముతూ ముద్దులు పెట్టారు. ఒకరి తర్వాత ఒకరు దాన్ని ముద్దులతో ముంచెత్తారు. అలా వారి ప్రేమానురాగాలను పొందాక.. వేల్ తిరిగి సముద్రంలోకి వెళ్లిపోయింది. అయితే, సముద్రంలోకి వెళ్లే సమయంలో ఈ తిమింగలం ఒక్కసారిగా నోరు తెరిచింది. ఆ సమయంలో పెద్ద సౌండ్‌ వచ్చింది. ఆ శబ్ధానికి టూరిస్టులు కాస్త భయపడినప్పటికీ.. అది మాత్రం వారిని ఏం చేయలేదు. తర్వాత తన దారి తాను చూసుకుని వెళ్లిపోయింది. నార్మల్‌గా పెంపుడు వేల్స్‌ కూడా ఉంటాయి. అవి చెప్పినట్టు వింటాయి. కానీ సముద్రంలో ఉండేవి ఎలా ఉంటాయో తెలియదు కదా.. టూరిస్టులు మాత్రం ఈ జర్నీలో తిమింగలంతో గడిపిన క్షణాలను మరిచిపోలేమని గుర్తుంచుకున్నారు. కాగా, ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్ అవుతోంది. ఈ బ్యూటీఫుల్ వీడియోను మీరూ ఒకసారి చూసేయండి.

Also read:

Viral Video: యజమాని కోసం ఇంజనీర్‌గా మారిన కుక్క.. వైరల్ అవుతున్న అద్భుతమైన వీడియో..!

Punjab Congress: సొంత పార్టీపైనే సెటైర్లు వేసిన సిద్ధూ.. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..!

Flying Object: క్రొయేషియాలో కుప్పకూలిన వింత వస్తువు.. కూలిన చోట భారీ గొయ్యి.. UFO అంటూ అనుమానాలు..!