Donald Trump: క‌న్‌స్ట్ర‌క్ష‌న్ వ‌ర్క‌ర్‌గా డొనాల్డ్ ట్రంప్‌.. అసలు విషయం తెలిస్తే షాక్..

|

Mar 18, 2022 | 4:20 PM

Donald Trump: సనాతన ధర్మం(Sanatana Darma) లో ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని నమ్మకం. ఈ విషయం నిజమేమో అనిపించేలా కొంతమందిని చూస్తుంటే.. వీళ్ళని ఎక్కడో చూశాం.. మనకు బాగా..

Donald Trump: క‌న్‌స్ట్ర‌క్ష‌న్ వ‌ర్క‌ర్‌గా డొనాల్డ్ ట్రంప్‌.. అసలు విషయం తెలిస్తే షాక్..
Viral Video Donald Trump
Follow us on

Donald Trump: సనాతన ధర్మం(Sanatana Darma) లో ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని నమ్మకం. ఈ విషయం నిజమేమో అనిపించేలా కొంతమందిని చూస్తుంటే.. వీళ్ళని ఎక్కడో చూశాం.. మనకు బాగా తెలిసినవారే అనిపిస్తారు. ముఖ్యంగా రాజకీయ నేతలు, నటీనటులు, క్రికెటర్స్ పోలికలు ఉన్న మనుషులకు చెందిన వ్యక్తులను, ఫోటోలు తరచుగా చూస్తూనే ఉంటున్నాం.  తాజాగా మాజీ అగ్రరాజ్య అమెరికా(America) అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కి చెందిన ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. ముందు ఈ వీడియో చూసి అయ్యో డొనాల్డ్‌ ట్రంప్‌కి ఎన్ని కష్టాలొచ్చాయో అని ముందు అనుకుంటున్నారు.. తర్వాత అసలు విషయం తెలిసి షాక్ తింటున్నారు.

ఓ వీడియో చూసిన నెటిజన్లు అగ్రరాజ్యానికి అధ్య‌క్షుడుగా పనిచేసిన ఈ మాజీ అధ్యక్షుడు ఇప్పడు క‌న్‌స్ట్ర‌క్ష‌న్ వ‌ర్క‌ర్‌గా పనిచేస్తున్నారా? ఆశ్చర్యంగా ఉందే..!! ఈ వీడియో చూసిన‌వారంద‌రూ ఇలానే నోరెళ్ల‌బెట్టారు. అయితే, అత‌డు నిజంగా డొనాల్డ్ ట్రంప్ కాదు.. అత‌డిలా ఉన్న మ‌రో వ్య‌క్తి..అయితే, ప్ర‌పంచంలో ఎంతోమంది ట్రంప్‌ను ఇమిటేట్ చేసేవాళ్లున్నా ఇత‌నంత ప‌ర్ఫెక్ట్‌గా ఎవ‌రూ అనుక‌రించ‌లేదు. అందుకే స‌డెన్‌గా చూసిన‌వాళ్లంతా ట్రంప్ ఇంతగా కష్టపడుతున్నారా అని ఆశ్చ‌ర్య‌పోతున్నార‌ట‌. న్యూయార్క్‌కు చెందిన ఈ వ్యక్తి కి క‌న్‌స్ట్రక్ష‌న్ కంపెనీ ఉందట. ఇత‌డు ట్రంప్‌ను పోలి ఉండ‌డ‌మేకాదు ట్రంప్‌లా హావ‌భావాలు కూడా ప‌లికిస్తాడట. ఈ డూప్‌ ట్రంప్‌ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది.

Also Read:

White Bread: బ్రెడ్‌ మరీ ఎక్కువగా తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..

Telangana: యాదాద్రిలో మహకుంభ సంప్రోక్షణకు ఏర్పాట్లు పూర్తి.. హాజరు కానున్న సీఎం.. ఆ తర్వాతే దర్శనాలకు అనుమతి

Bangladesh: ఇస్కాన్ టెంపుల్‌పై 200 మంది దాడి.. విగ్రహాలను అపవిత్రం చేసి డబ్బు, నగలు దోచుకెళ్లిన మూక