Viral Video: మీరెప్పుడైనా ఇలాంటి డేంజరస్‌ యాక్సిడెంట్‌ చూశారా?… కళ్లు మూసి తెరిచేలోపే అమాంతం గాల్లోకి ఎగిరిపడ్డ కారు

మీ కళ్లముందే కారు అమాంతం గాల్లోకి ఎగిరి నాలుగు పల్టీలు కొట్టిన సంఘటన ఎప్పుడైనా చూశారా? రోడ్డు మీద ఘోర ప్రమాదం లైవ్‌లో కనపడిందా? అలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే...

Viral Video: మీరెప్పుడైనా ఇలాంటి డేంజరస్‌ యాక్సిడెంట్‌ చూశారా?... కళ్లు మూసి తెరిచేలోపే అమాంతం గాల్లోకి ఎగిరిపడ్డ కారు
Car Dangerous Accident On R

Updated on: Oct 07, 2025 | 4:15 PM

మీ కళ్లముందే కారు అమాంతం గాల్లోకి ఎగిరి నాలుగు పల్టీలు కొట్టిన సంఘటన ఎప్పుడైనా చూశారా? రోడ్డు మీద ఘోర ప్రమాదం లైవ్‌లో కనపడిందా? అలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే కనిపిస్తుంటాయి. కానీ ఈ ప్రమాదం మాత్రం డేంజరస్‌ స్టంట్‌లాగా జరింగింది. ఓ కారు నడి రోడ్డుపై హఠాత్తుగా దూసుకొచ్చి డివైడర్‌కు ఢీకొట్టుకుని గాల్లో పల్టీలు కొట్టి రోడ్డుపై వెల్లకిలా బోల్తా పడింది. కారు వేగంగా ఢీకొనడంతో టైర్లు ఊడిపడ్డాయి. ఈ ఘోర ప్రమాదం తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో జరిగినట్లు తెలుస్తోంది.

ఆ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రద్దీగా ఉన్న రోడ్డుపై హఠాత్తుగా కళ్లు బైర్లు కమ్మే షాకింగ్ ఘటన జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ కారు ఒక్కసారిగా గాల్లోకి ఎగురుకుంటూ రోడ్డుపై పడింది. అక్కడితో ఆగకుండా పల్టీలు కొట్టుకుంటూ చాలా దూరం వెళ్లి ఉల్టా పడిపోయింది. కారులో ఉన్న వ్యక్తి రోడ్డుపై ఎగిరి పడ్డాడు. అయిన ఆ కారు చాలా దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎగిరి పడిపోయిన వ్యక్తితో పాటు కారు డ్రైవర్‌ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

వీడియో చూడండి:

కళ్లముందే ఘోర ప్రమాదం జరగడంతో స్థానికులు షాక్‌ అయ్యారు. ఏం జరిగిందో తేరుకుని భయపడుతూనే కారు వద్దకు చేరుకున్నారు. పూర్తిగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ కావడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. లక్షల మంది వీక్షించారు.

ఈ వీడియోపై సోషల్‌ మీడియా యూజర్స్‌ వివిధ రకాలుగా రియాక్ట్‌ అవుతున్నారు. కారు టైరు పగిలిపోయి ఉంటుందని కొందరు పోస్టులు పెడుతున్నారు. అయ్యో ఎంత ఘోరం అంటూ మరికొంత మంది కామెంట్స్‌ పెడుతున్నారు.