Viral Video: నీ ఇకమత్‌ తగలెయ్య.. ఈ లోపు ఫ్లైట్‌ తుర్రుమంటే… విమానాశ్రయంలో స్లీపింగ్ పాడ్స్‌పై నెటిజన్స్‌ రియాక్షన్‌

మీరు ఎప్పుడైనా విమానాశ్రయంలో స్లీపింగ్ పాడ్‌లో సమయం గడిపారా? విమానాశ్రయంలో ప్రయాణీకులు కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఉద్దేశించిన ఈ కాంపాక్ట్ స్థలాలను నిర్దిష్ట వ్యవధికి అద్దెకు తీసుకుని ఓ కునుకు తీయవచ్చు. ఇటీవల బెంగళూరు విమానాశ్రయంలో స్లీపింగ్ పాడ్‌ల గురించిన రీల్ సోషల్‌ మీడియాలో వైరల్...

Viral Video: నీ ఇకమత్‌ తగలెయ్య.. ఈ లోపు ఫ్లైట్‌ తుర్రుమంటే... విమానాశ్రయంలో స్లీపింగ్ పాడ్స్‌పై నెటిజన్స్‌ రియాక్షన్‌
Sleeping Pods In Airport

Updated on: Nov 22, 2025 | 5:32 PM

మీరు ఎప్పుడైనా విమానాశ్రయంలో స్లీపింగ్ పాడ్‌లో సమయం గడిపారా? విమానాశ్రయంలో ప్రయాణీకులు కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఉద్దేశించిన ఈ కాంపాక్ట్ స్థలాలను నిర్దిష్ట వ్యవధికి అద్దెకు తీసుకుని ఓ కునుకు తీయవచ్చు. ఇటీవల బెంగళూరు విమానాశ్రయంలో స్లీపింగ్ పాడ్‌ల గురించిన రీల్ సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్స్‌ను ఆకట్టుకుంటుంది. ఏర్పాట్లు బాగనే ఉన్నాయి కానీ, ఈ టైమ్‌లో ఫ్లైట్‌ మిస్సయితే ఎవరిది బాధ్యత అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

కెంపెగౌడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు టెర్మినల్ 1లోని 080 లాంజ్ లోపల ఉన్న పాడ్‌లను వీడియో చూపిస్తుంది. ఆటోమేటిక్ తలుపులు తెరిచిన తర్వాత, లోపలి భాగంలో వివిధ బటన్లను సూచిస్తుంది. అవి ఫ్యాన్లు, లైట్లు, సీటు రిక్లైనింగ్, సంగీతం, వేడి మొదలైన వాటిని నియంత్రించడానికి ఏర్పాటు చేశారు. మసాజ్, “జీరో-గ్రావిటీ” కోసం ఎంపికలు ఉన్నాయి. అత్యవసర బటన్‌ను కూడా వీడియోలో చూడొచ్చు.

క్యాప్షన్‌లో, ఈ పాడ్‌లలో 2 గంటలు గడిపినందుకు సుమారు రూ. 1,300 చెల్లించాల్సి ఉంటుందట. ప్రయాణీకులు లోపలికి ప్రవేశించే ముందు వారి బూట్లు తీయాలి. ఈ వీడియో చూసిన నెటిజన్స్‌ రకరకాలు కామెంట్స్‌ పెడుతున్నారు. కొంతమంది పాజిటివ్‌గా స్పందిస్తే మరికొంతమంది నెగటివ్‌ కామెంట్స్‌ పెడుతున్నారు.

వీడియో చూడండి: