Viral Video: బంగారం ఇలా కూడా డెలివరీ చేస్తారా…? నెట్టింట స్విగ్గీ వీడియో వైరల్‌

కాదేదీ కవితకు అనర్హం అన్నట్లుగా కాదేదీ డోర్‌ డెలివరీకి అనర్హం అంటూ చాటుతోంది ప్రముఖ క్విక్‌ కామర్స్‌ సంస్థ స్విగ్గీ. ఆహారం, కిరాణా సరుకులే కాదు.. ఏకంగా బంగారం కూడా డోర్‌ డెలివరీ చేస్తోంది స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్‌. డోర్‌ స్టెప్‌ గోల్డ్‌ డెలివరీ అంటూ హై సెక్యూరిటీ మధ్య సరికొత్తగా డెలివరీ సర్వీసులు మొదలు పెట్టింది. ఇందుకు...

Viral Video: బంగారం ఇలా కూడా డెలివరీ చేస్తారా...? నెట్టింట స్విగ్గీ వీడియో వైరల్‌
Swiggy Gold Delivery

Updated on: May 05, 2025 | 6:10 PM

కాదేదీ కవితకు అనర్హం అన్నట్లుగా కాదేదీ డోర్‌ డెలివరీకి అనర్హం అంటూ చాటుతోంది ప్రముఖ క్విక్‌ కామర్స్‌ సంస్థ స్విగ్గీ. ఆహారం, కిరాణా సరుకులే కాదు.. ఏకంగా బంగారం కూడా డోర్‌ డెలివరీ చేస్తోంది స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్‌. డోర్‌ స్టెప్‌ గోల్డ్‌ డెలివరీ అంటూ హై సెక్యూరిటీ మధ్య సరికొత్తగా డెలివరీ సర్వీసులు మొదలు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఒక స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్ తన స్కూటర్‌పై వెళుతుండగా, ఓ గార్డు చేతిలో మినీ లాకర్ పట్టుకుని ప్రయాణిస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ క్లిప్‌లో ఇన్‌స్టామార్ట్ డెలివరీ ఏజెంట్ బైక్‌పై ముందు భాగంలో కూర్చుని బ్రాండ్ టీ-షర్టు ధరించి ఉన్నాడు. ఒక గార్డు వెనుక భాగంలో లాకర్‌ను పట్టుకుని కనిపించాడు. ఆ లాకర్‌పై ఇన్‌స్టామార్ట్ స్టిక్కర్ ఉంది. వైరల్ భయానీ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో డెలివరీ ఎగ్జిక్యూటివ్ వీడియోను షేర్ చేశారు. ఇలాంటి ఫోటోనే ఇన్‌స్టాగ్రామ్‌లో మరొక యూజర్ పోస్ట్ చేశారు. అందులో “ఏం జరుగుతోంది?” అని ఉంది. ఆ క్షణాన్ని మిస్ అవ్వకుండా, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో “రియల్ గోల్డ్ డెలివరీ కర్నే కే లియే రియల్ సెక్యూరిటీ చాహియే బ్రో” అనే క్యాప్షన్‌తో ఆ క్లిప్‌ను షేర్ చేసింది.

బ్రాండ్ “ప్రతి కొన కొనలో సోనాను డెలివరీ చేస్తోంది” అని ఒక యూజర్‌ రిప్లై కనపడుతుంది. బంగారం మరియు వెండి నాణేలను నేరుగా కస్టమర్లకు డెలివరీ చేయడానికి స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఇటీవల కళ్యాణ్ జ్యువెలర్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. దేశంలోని దాదాపు 100 నగరాల్లో 0.5 గ్రాము నుంచి 1 గ్రాము బంగారం, 5 గ్రాముల నుండి 20 గ్రాముల బరువున్న వెండి నాణేలను డోర్‌ డెలివరీ చేస్తున్నారు.

 

 

వీడియో చూడండి :