Viral Video: సరిగ్గా రైలు పట్టాల మీదికి వ్యాన్‌ రాగానే గేటు పడింది… ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి…

ఒక భయంకరమైన యాక్సిడెంట్‌కు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. హైస్పీడ్ రైలు పట్టాల మీద ఆగిన వ్యాన్‌ను ఢీకొన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సంఘటన పోలిష్ గ్రామమైన వోలా ఫిలిపోవ్స్కాలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ భయంకరమైన సంఘటన అక్కడే ఉన్న CCTV కెమెరాలో రికార్డ్‌...

Viral Video: సరిగ్గా రైలు పట్టాల మీదికి వ్యాన్‌ రాగానే గేటు పడింది... ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి...
Train Hit Van On Track

Updated on: Aug 07, 2025 | 7:01 PM

ఒక భయంకరమైన యాక్సిడెంట్‌కు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. హైస్పీడ్ రైలు పట్టాల మీద ఆగిన వ్యాన్‌ను ఢీకొన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సంఘటన పోలిష్ గ్రామమైన వోలా ఫిలిపోవ్స్కాలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ భయంకరమైన సంఘటన అక్కడే ఉన్న CCTV కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి. ఫుటేజ్‌లో డ్రైవర్ పట్టాలు దాటేలోపు రైల్వే గేటు పడుతుంది. దీంతో తెల్లటి వ్యాన్ ట్రాక్‌పై చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. దీని ఫలితంగా భయంకరమైన యాక్సిడెంట్‌ జరిగింది.

వ్యాన్ ట్రాక్ మధ్యలో ఉన్నప్పుడు రైల్వే గేట్లు కిందికి దిగుతున్నట్లు వీడియో చూపిస్తుంది. మొదట, ఒక గేటు మాత్రమే పడుతుంది. రెండో గేటు దాటేలోపే అది కూడా కిందికి దిగిపోతుంది. దీంతో ఆ వ్యాను పట్టాల మీదే చిక్కుబడిపోయింది. వేగంగా వస్తున్న రైలు దగ్గరకు వచ్చేసరికి, డ్రైవర్ వాహనాన్ని ఢీకొట్టకుండా ఉండటానికి ట్రాక్ పక్కకు తీసుకెళ్లాడు. కానీ వ్యాన్ వెనకభాగం ఇంకా ట్రాక్‌లోనే ఉండటంతో వేగంగా వస్తున్న రైలు వాహనంలోకి దూసుకెళ్లడంతో అతని ప్రయత్నాలు ఫలించలేదు.

రైలు వేంగగా ఢీకొనడంతో వాహనం పూర్తిగా ధ్వంసమైంది. అయితే, అదృష్టవశాత్తూ, ఈ దారుణమైన ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు, వ్యాన్ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. కేసు నమోదు చేసుకున్న స్థానిక అధికారులు సంఘటనపై దర్యాప్తు చేపట్టారు.

వీడియో చూడండి:

 

సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ కావడంతో నెటిజన్స్‌ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చాలామంది డ్రైవర్‌ను బాధ్యులుగా భావిస్తున్నారు. 95% మంది డ్రైవర్లు ఎంత తెలివితక్కువవారు, పిచ్చివాళ్ళో ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ అంటూ పోస్టు పెట్టారు. రైల్వే గేట్‌ కీపర్‌ను విమర్శిస్తూ మరికొందరు కామెంట్స్‌ పెడుతున్నారు.