Viral Video: వాహ్‌.. సింహానికి చుక్కలు చూపించిన చిరుత… వైరల్‌ వీడియోతో నెటిజన్స్‌ ఫిదా…

అడవికి సింహం రాజు అంటారు. బలంలో దానికి మించింది లేదు. ఏ జంతువైనా ఒక్కసారి సింహం పంజాకు చిక్కిందా ఇక దానికి ఆహారం అయిపోవాల్సిందే. అలాంటిది ఓ చిరుతపులి సింహానికి చుక్కలు చూపించింది. చిరుత పంజాకు చిక్కిన చిరుతపులి చాకచక్యంగా తప్పించుకుంది...

Viral Video: వాహ్‌.. సింహానికి చుక్కలు చూపించిన చిరుత... వైరల్‌ వీడియోతో నెటిజన్స్‌ ఫిదా...
Lion Vs Leopard

Updated on: Jul 21, 2025 | 12:41 PM

అడవికి సింహం రాజు అంటారు. బలంలో దానికి మించింది లేదు. ఏ జంతువైనా ఒక్కసారి సింహం పంజాకు చిక్కిందా ఇక దానికి ఆహారం అయిపోవాల్సిందే. అలాంటిది ఓ చిరుతపులి సింహానికి చుక్కలు చూపించింది. చిరుత పంజాకు చిక్కిన చిరుతపులి చాకచక్యంగా తప్పించుకుంది. ఈ వీడియో ఇప్పుడు పోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చిరుతపులి కంటే సింహం శక్తివంతమైనది అయినప్పటికీ, అది చిరుతపులి వేగానికి సాటిరాదు. అడవిలో ఈ జంతువులు ఎదురు పడినప్పుడు జరిగిన పోరు వైరల్‌ అవుతోంది. ఈ దృశ్యం టాంజానియా అడవుల్లోనిదిగా తెలుస్తోంది. సింహం, చిరుత మధ్య జరిగిన భీకర పోరాటం ఒక బ్లాక్ బస్టర్ చిత్రం కంటే తక్కువేమీ కాదన్నట్లుగా ఉంది వాటి ఫైటింగ్‌.

తమ ప్రాణాలను కాపాడుకునే విషయంలో ఏ జంతువైన ఆఖరి వరకు పోరాడుతుంది. వైరల్ అవుతున్న వీడియోలో సింహంచిరుతను పడగొట్టి తన ఆహారంగా మార్చడానికి ప్రయత్నించినట్లు చూడవచ్చు. కానీ చిరుతపులి కూడా అంత తేలికగా దక్కనని ప్రతిజ్ఞ చేసినట్లుతా పోరాడుతుంది. చిరుతపులి నేలపై పడిపోయినప్పటికీ తేలికైన శరీరాన్ని సద్వినియోగం చేసుకుని సింహరాశిపై ఎదురుదాడి చేయడం ప్రారంభించింది.

చిరుతపులి తన శక్తినంతా ఉపయోగించి..అస్సలు నిశ్శబ్దంగా కూర్చోలేదు. దాని కోరలు, కత్తి లాంటి గోళ్ళతో సింహంపై నిరంతరం దాడి చేసింది. సింహానికి దాడి చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. దాదాపు 14 సెకన్ల పాటు జరిగిన ఈ భీకర పోరాటం చూసి నెటిజన్స్‌ చిరుత పోరాటానికి ఫిదా అవుతున్నారు. వేగం వర్సెస్‌ బలంలో ఎవరు గెలిచారో చూడండి అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

వీడియో చూడండి: