Viral Video: పాముని మింగిన కప్ప.. వీడియో చూస్తే మీ కళ్ళను మీరే నమ్మలేరు!

సాధారణంగా కప్పలు, చిన్న చిన్న చేపలు, పురుగులను పాములు మింగడం జరుగుతుంది. కానీ ఓ కప్ప మాత్రం రొటీన్‌కు భిన్నంగా ఏకంగా పామును నోట్లో వేసుకుని కసపిస మింగేందుకు యత్నించింది. తన వద్దకు వచ్చిన పామును గుటుక్కున నోట కరచుకుని గుటకాయ స్వాహ.. చేసేపనిలో పడింది. ఇందుకు సంబంధించిన..

Viral Video: పాముని మింగిన కప్ప.. వీడియో చూస్తే మీ కళ్ళను మీరే నమ్మలేరు!
Frog Swallowing A Baby Snake

Updated on: May 10, 2024 | 5:27 PM

సాధారణంగా కప్పలు, చిన్న చిన్న చేపలు, పురుగులను పాములు మింగడం జరుగుతుంది. కానీ ఓ కప్ప మాత్రం రొటీన్‌కు భిన్నంగా ఏకంగా పామును నోట్లో వేసుకుని కసపిస మింగేందుకు యత్నించింది. తన వద్దకు వచ్చిన పామును గుటుక్కున నోట కరచుకుని గుటకాయ స్వాహ.. చేసేపనిలో పడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్‌ చల్‌ చేస్తోంది. మీరూ చూసేయండి..

ఈ వీడియోలో ఓ కప్ప పాము పిల్లను నోట కరచుకుని కనిపిస్తుంది. తోక భాగం నుంచి సగం మింగిన కప్ప పాము తల భాగం మాత్రం అలా వదిలేసింది. దీంతో కప్ప నోట్లో ఇరుక్కుపోయిన పాము పిల్ల లబో..దిబో.. మంటూ మెలికలు తిరుగుతూ నోరు తిరిచి అరవడం వీడియోలో చూడొచ్చు. తప్పించుకునే దారిలేక పాము అవస్థలు అన్నీఇన్నీ కావు. గజేంద్ర మోక్షం పర్వంలో మొసలి నోటికి చిక్కిన ఏనుగు మాదిరి పాము అవస్థలు పడటం వీడియోలో కనిపిస్తుంది. ఇక ఈ వీడియోకు ఇప్పటి వరకు మిలియన్లలో వీక్షణలు లక్షల్లో లైకులు రావడంతో నెట్టింట వైరల్‌గా మారింది. ఎంతైనా రోటీన్‌కు భిన్నంగా జరిగితే అదీ ఓ వింతే..

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us