Viral Video: పాపం ఇమ్రాన్ ఖాన్.. పాకిస్తాన్ ప్రధానిని ఓ రేంజ్‌లో ఆటాడేసుకుంటున్న నెటిజన్లు..

|

Mar 14, 2022 | 7:20 PM

Trending Video: కాలం ఎప్పుడూ ఒకేవైపు ఉండదంటారు.. టైమ్ వచ్చింది కదా అని రెచ్చిపోయి ప్రవర్తిస్తే.. తదుపరి వచ్చే ట్విస్ట్‌ కళ్లో కూడా ఊహించని విధంగా ఉంటుందంటారు.

Viral Video: పాపం ఇమ్రాన్ ఖాన్.. పాకిస్తాన్ ప్రధానిని ఓ రేంజ్‌లో ఆటాడేసుకుంటున్న నెటిజన్లు..
Imran Khan
Follow us on

Trending Video: కాలం ఎప్పుడూ ఒకేవైపు ఉండదంటారు.. టైమ్ వచ్చింది కదా అని రెచ్చిపోయి ప్రవర్తిస్తే.. తదుపరి వచ్చే ట్విస్ట్‌ కళ్లో కూడా ఊహించని విధంగా ఉంటుందంటారు. ఇప్పుడిదే పరిస్థితిని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎదుర్కొంటున్నారు. ప్రత్యర్థుల భాషను, వారి పరిణతిని, జ్ఞానాన్ని కించపరుస్తూ విమర్శలు గుప్పించిన ఇమ్రాన్.. ఇప్పుడు అంతకంటే దారుణమైన విమర్శలు, కామెంట్స్ ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆ కామెంట్స్, ట్రోల్స్, విమర్శలు తట్టుకోలేక విలవిల్లాడిపోతున్నాడాయన. అవును.. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉందనే చెప్పాలి. ఇప్పటికే రాజకీయంగా తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న ఆయన.. ఇప్పుడు నెటిజన్ల ట్రోలింగ్‌కు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కో చైర్మన్ ఆసిఫ్ అలీ జర్దారీ కుమారుడు బిలావల్ బుట్టో ఒక సందర్భంలో ఉర్దూ తప్పుగా మాట్లాడారు. దాన్ని బేస్ చేసుకుని.. బుట్టోపై సెటైర్లు వేశాడు ఇమ్రాన్ ఖాన్. బిలావల్ బుట్టో ముందుగా ఉర్దూ నేర్చుకోవాలంటూ ఎగతాళి చేశాడు. ఇక.. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఆయన మాట్లాడిన ఉర్దే.. ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టింది. సోషల్ మీడియా వేదికగా ఉన్న పరువును కూడా ఊడ్చి పడేస్తోంది. తాజాగా ఓ అంశాని సంబంధించి ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించాడు. ఆ ప్రసంగం ఉర్దూలో సాగగా.. అన్నీ తప్పులే ఉన్నాయి. దీన్ని ఛాన్స్‌గా తీసుకున్న బిలావల్ బుట్టో.. ఇమ్రాన్‌ను ఓ రేంజ్‌లో ఎద్దేవా చేశారు. ఇమ్రాన్ ఖాన్ ఉర్దూపై ఓ స్పూఫ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో ఇమ్రాన్ ఖాన్ ఉర్దూ ప్రసంగంలో అనేక పొరపాట్లు, తడబాట్లు ఉన్నాయి. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. పాకిస్తానీలు మొదలు.. యావత్ ప్రపంచంలోని ఉర్దూ ప్రేమికులు.. ఇమ్రాన్‌పై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. ఒకవిధంగా సెటైర్లతో దంచికొడుతున్నారనే చెప్పాలి. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ‘ఒకరిని నిందించే ముందు.. మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి.’ అంటూ హితవు పలుకుతున్నారు. ఇమ్రాన్ ఉర్దూ ప్రసంగంపై మీమ్స్ కూడా చేస్తూ రచ్చ రచ్చ చేస్తు్న్నారు మీమర్స్, సోషల్ మీడియా యూజర్స్.

Also read:Hyderabad: హైదరాబాద్ ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. రేపటినుంచే ప్రజలకు అందుబాటులోకి..

Samsung Galaxy M53 5G: శామ్‌సంగ్ నుంచి నయా స్మార్ట్‌ఫోన్.. లీకైన వివరాలు.. ఫీచర్స్ చూస్తే వావ్ అంటారు..!

Holi 2022: హోలీ రోజున ఈ వాస్తు పద్ధతలు పాటిస్తే ఏళ్లుగా పట్టిపీడిస్తున్న ఆర్థిక సమస్యలు దూరమవుతాయట..!