Viral Video: భారతదేశ స్వాతంత్రం దినోత్సవ సంబరాలను ముఖేష్ అంబానీ, అతని భార్య నీతా అంబానీ ఇంట వైభవంగా జరుపుకున్నారు. వారు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా నరేంద్ర మోడీ పిలుపు ఇచ్చిన ‘హర్ ఘర్ తిరంగ’ ఉత్సవంలో పాల్గొన్నారు. విలాసానికి ఇంటికి ప్రతిరూపమైన ముంబై లోని ముఖేష్ అంబానీ ఇల్లు (Mukesh Ambani’s luxurious house) యాంటిలియాని త్రివర్ణ పతాకంలోని రంగుల లైట్లతో ఆవిష్కరించారు. ఇంటిని లైట్స్ తో అలంకరణలో భాగంగా జాతీయ జెండా, అశోక చక్రం, జాతీయ జంతువు పులి సహా అనేక చిహ్నాలు ఉన్నాయి. ఇంటిని చూడడానికి అనేక మంది సందర్శకులు యాంటిలియా వెలుపల గుమిగూడారు. తమ చేతిలోని సెల్ ఫోన్లకు, కెమెరాలకు పని చెప్పి.. ఫోటోలు తీసుకున్నారు, వీడియోలను క్లిక్ చేయడం కనిపించింది. అంతేకాదు ఈ చారిత్రాత్మక రోజున అంబానీలు ప్రజలకు ఫలహారాలు కూడా అందించారు.
దిగువ వైరల్ వీడియోలు, చిత్రాలను చూడండి:
Ambani House Antilia must celebrate not just for a couple of days but all through this year. They owe the nation much much more !!
— ProfMKay ?????? ?? (@ProfMKay) August 15, 2022
అంతకుముందు, శ్లోకా మెహతా, ఆకాష్ అంబానీల కుమారుడైన పృథ్వీ అంబానీతో కలిసి నీతా, ముఖేష్ అంబానీ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు.
#WATCH | Reliance Industries chairman Mukesh Ambani along with his wife Nita Ambani and grandson Prithvi Ambani celebrates Independence Day pic.twitter.com/QNC8LmtoHL
— ANI (@ANI) August 15, 2022
పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా ‘హర్ ఘర్ తిరంగా’ఉత్సవంలో భాగస్వామ్యులయ్యారు. కొందరు జాతీయ జెండాను ఎగురవేశారు, మరికొందరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తమ డీపీలను త్రివర్ణ పతాక చిత్రంతో ఏర్పాటు చేసుకున్నారు. అనిల్ కపూర్ , సిద్ధార్థ్ మల్హోత్రా , వరుణ్ ధావన్, కంగనా రనౌత్ చాలా మంది తమ డీపీలను మార్చారు.
I am really very much impressed by the way that Ambani family is amazing and looks are the awesome Ambani House Antilia pic.twitter.com/iuqqRRPjJC
— @Diana (@Diana90340) August 15, 2022
హర్ ఘర్ తిరంగ:
భారతదేశం స్వాతంత్యం పొంది 76 వ సంవత్సరంలో అడుగు పెట్టిన అద్భుతమైన రోజు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో దేశ ప్రజలందరూ భాగస్వామ్యులయ్యారు. ప్రతిచోటా భారతీయులు తమ ఇళ్లలో జాతీయ జెండాను ఎగురవేసి స్ఫూర్తినింపుకున్నారు.
These is treat to eyes and felt goosebumps seeing the celebrations in
Ambani House Antilia ,Jai Hind pic.twitter.com/CrZvZKC877— Zantim ?️ (@Bunny_Zantim) August 15, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..