Viral Video: నీళ్లపై నడిచే బైక్‌ను తయారు చేసిన వ్యక్తి.. జుగాడ్ వీడియోపై ఓ లుక్ వేయండి

|

Oct 16, 2023 | 11:31 AM

భారతీయ ప్రజలు చాలా మంచి జుగడ్ లు తయారు చేస్తారు. తమ అవసరాలకు అనుగుణంగా అందు బాటులో ఉన్న వస్తువులతో సరికొత్త వస్తువులను తయారు చేస్తారు. ఇప్పుడు జుగాడ్ ద్వారా ఓ వ్యక్తి నీటిలో హాయిగా నడిచే బైక్‌ను తయారు చేసిన వీడియోను చూడండి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ వ్యక్తి ఎటువంటి ఆధునిక టెక్నిక్ సహాయం తీసుకోలేదు. తన దొరికిన వ్యర్థాలతో ఈ అద్భుతం చేశాడు.

Viral Video: నీళ్లపై నడిచే బైక్‌ను తయారు చేసిన వ్యక్తి.. జుగాడ్ వీడియోపై ఓ లుక్ వేయండి
Viral Video
Follow us on

ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రజలు ఎప్పుడూ కొన్ని వింత పనులు చేస్తూనే ఉంటారు. ఈ వీడియోలు ఎక్కువగా స్టంట్‌లకు సంబంధించినవి. రోడ్డు మీద, బావిలో, కొండ బాటలో బైక్‌తో విన్యాసాలు చేయడం చాలా మందిని మీరు చూసి ఉంటారు. అయితే నదిలో ఎవరైనా బైక్ నడుపుతున్నట్లు మీరు ఎప్పుడైనా చూశారా? ఇలాంటి సంఘటనలు కేవలం ఊహలో మాత్రమే జరుగుతూ ఉంటాయి. అయితే ఇలా అనుకుంటే తప్పే. ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తి తన తెలివి తేటలకు పదును పెట్టి… బైక్ ను నీటి మీద ప్రయాణం చేసేలా రెడీ చేశాడు. జగడ్ బైక్‌ను తయారు చేశాడు. ఇది చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.

భారతీయ ప్రజలు చాలా మంచి జుగడ్ లు తయారు చేస్తారు. తమ అవసరాలకు అనుగుణంగా అందు బాటులో ఉన్న వస్తువులతో సరికొత్త వస్తువులను తయారు చేస్తారు. ఇప్పుడు జుగాడ్ ద్వారా ఓ వ్యక్తి నీటిలో హాయిగా నడిచే బైక్‌ను తయారు చేసిన వీడియోను చూడండి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ వ్యక్తి ఎటువంటి ఆధునిక టెక్నిక్ సహాయం తీసుకోలేదు. తన దొరికిన వ్యర్థాలతో ఈ అద్భుతం చేశాడు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

ఆ యువకుడు నాలుగు గ్యాలన్ల సహాయంతో బైక్‌ను అటాచ్ చేసి, ఆపై నీటిపై బైక్‌ను హ్యాపీగా నడుపుతున్నట్లు వీడియోలో మీరు చూడవచ్చు. అంతే కాదు, నది మధ్యలో హ్యాండిల్‌ని వదిలేసి, నీటిలో విన్యాసాలు చేస్తూ చాలా ఆనందంగా కనిపిస్తాడు. అయితే, ఈ వాహనాన్ని చూస్తుంటే జుగడ్ ద్వారా మాత్రమే ఈ బైక్‌ను నడపవచ్చని స్పష్టమవుతోంది. ఇందులో భద్రతకు ఎలాంటి భరోసా లేదు.

క్రాక్‌మైండ్111 అనే ఖాతా ద్వారా ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వార్త రాసే సమయానికి, రెండు లక్షల మందికి పైగా ప్రజలు దీనిని చూశారు. దీనిపై రకరకాల స్పందనలను ఇస్తున్నారు. భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. ఒకరు కేవలం మీ ఇష్టానికి లేదా వ్యూస్ కోసం ఇలాంటి పనులు చేయవద్దంటూ హెచ్చరించారు. మరొకరు  ఈ ‘జుగడ్ సృజనాత్మకమైనది అయితే ఇది చాలా ప్రమాదకరమని వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..