Viral Video: నది మధ్యలో వ్యక్తి.. అంతకంతకూ పెరుగుతున్న నీటి మట్టం.. షాకింగ్‌ వీడియో

జమ్ము కశ్మీర్‌ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ప్రధాన నదుల్లో నీటి మట్టం పెరిగింది. పలు నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. తాజాగా జమ్ములోని తావి నదిలో ఓ వ్యక్తి చిక్కుకుపోయాడు. భారీ వర్షాల కారణంగా ప్రస్తుతం తావి నది ఉప్పొంగి ప్రమాదకర స్థాయిలో...

Viral Video: నది మధ్యలో వ్యక్తి.. అంతకంతకూ పెరుగుతున్న నీటి మట్టం.. షాకింగ్‌ వీడియో
Man Struck In River

Updated on: Jun 26, 2025 | 6:17 PM

జమ్ము కశ్మీర్‌ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ప్రధాన నదుల్లో నీటి మట్టం పెరిగింది. పలు నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. తాజాగా జమ్ములోని తావి నదిలో ఓ వ్యక్తి చిక్కుకుపోయాడు.

భారీ వర్షాల కారణంగా ప్రస్తుతం తావి నది ఉప్పొంగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నదిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి నది మధ్యలో ప్రమాదవశాత్తూ చిక్కుకుపోయాడు. నదిలోని ఓ వంతెన వద్ద నిలబడి సాయం కోసం ఎదురుచూసాడు. నది ఒడ్డున ఉన్న స్థానికులు ఆ వ్యక్తిని గుర్తించి సాయం చేసేందుకు ప్రయత్నించారు.

అయితే, నదిలో నీటి ప్రవాహం పెరుగుతుండటంతో వీలు పడలేదు. దీంతో వారు సహాయక బృందాలకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది నిచ్చెన సాయంతో నీటి మధ్యలో చిక్కుకుపోయిన వ్యక్తిని సురక్షితంగా వంతెన పైకి తీసుకొచ్చారు. వ్యక్తి నది మధ్యలో చిక్కుకుపోయిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

వీడియో చూడండి: