Viral Video: కదులుతున్న కారుపై స్టంట్ వేస్తే ఎంత పనైపాయెరా!… సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన హాపూర్‌ పోలీసులు

సోషల్‌ మీడియాలో ఫేమస్‌ కావడానికి యువత ప్రమాదక స్టంట్స్‌ వేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. మరికొందరు జైళ్లో ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితిని చేజేతులా కొని తెచ్చుకుంటున్నారు. అలాంటి సంఘటనే తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. హాపూర్ జిల్లాలో కదులుతున్న స్కార్పియో కారుపై ఒక వ్యక్తి ప్రమాదకరమైన స్టంట్ చేస్తున్న...

Viral Video: కదులుతున్న కారుపై స్టంట్ వేస్తే ఎంత పనైపాయెరా!... సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన హాపూర్‌ పోలీసులు
Stunt On Running Car

Updated on: Aug 29, 2025 | 8:51 PM

సోషల్‌ మీడియాలో ఫేమస్‌ కావడానికి యువత ప్రమాదక స్టంట్స్‌ వేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. మరికొందరు జైళ్లో ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితిని చేజేతులా కొని తెచ్చుకుంటున్నారు. అలాంటి సంఘటనే తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. హాపూర్ జిల్లాలో కదులుతున్న స్కార్పియో కారుపై ఒక వ్యక్తి ప్రమాదకరమైన స్టంట్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ క్లిప్‌ను బాగ్‌పత్ (బాబు గర్) పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే హైవేపై చిత్రీకరించినట్లు సమాచారం. ఈ సంఘటన వైరల్ అయిన తర్వాత పోలీసులు డ్రైవర్‌పై సత్వర చర్యలు తీసుకుని అతన్ని అరెస్టు చేశారు.

క్లిప్‌లో, ఆ వ్యక్తి రెండు ముందు తలుపులు తెరిచి స్కార్పియో వాహనాన్ని నడుపుతున్నట్లు కనిపిస్తుంది. ఆపై అతను డ్రైవర్‌ సీటును స్టీరింగ్‌ను వదిలేసి కారు రన్నింగ్‌లో ఉండగానే బయటికి వస్తాడు. కారు కదులుతూనే ఉండగా, అతను బానెట్‌పైకి ఎక్కి అక్కడే నిల్చున్నాడు. ఈ వీడియోను స్కార్పియో పక్కన నడుపుతున్న మరొక కారు చిత్రీకరించిందని నెటిజన్స్‌ భావిస్తున్నారు.

ఆ ప్రమాదకర స్టంట్ చేసినందుకు డ్రైవర్‌కు మోటారు వాహనాల చట్టం కింద చర్యలు తీసుకున్నారు. ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి, అతని కారును స్వాధీనం చేసుకున్నట్లు హాపూర్ పోలీసులు ధృవీకరించారు. అతనిపై రూ. 30,500 చలాన్ విధించారు.

వీడియో చూడండి:

“హాపూర్ జిల్లాలో, ఒక వ్యక్తి స్టీరింగ్ వదిలి కదులుతున్న స్కార్పియో కారు బానెట్‌పైకి ఎక్కి స్టంట్లు, రీల్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హాపూర్ పోలీసులు వెంటనే దీనిని గ్రహించి, స్కార్పియో కారు డ్రైవర్‌ను కారుతో పాటు అదుపులోకి తీసుకుని, MV చట్టం కింద చర్య తీసుకున్నారు. రూ. 30,500/- చలాన్ జారీ చేసి, స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.” అని పోలీసులు ప్రకటించారు.