
నాగుపామును ముద్దాడుతూ తీసిన వీడియోను ఆన్‌లైన్‌లో పెట్టి వైరల్ చేయాలనుకున్న ఓ వ్యక్తి ప్రయత్నం బెడిసికొట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో జరిగిన ఈ ఘటనలో బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. హైబత్‌పూర్‌గ్రామానికి చెందిన 50 ఏళ్ల జితేంద్ర కుమార్ అనే రైతు.. తనకున్న పొలంలో వ్యవసాయం చేస్తుంటాడు. కాగా, గత శుక్రవారం రోజున గ్రామంలోని ఓ ఇంటి గోడలో కనిపించిన పామును అతడు పట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా.. దానిని మెడలో వేసుకొని అందరి ముందు దానితో విన్యాసాలు చేయటం మొదలు పెట్టాడు.
అదే సమయంలో.. తన విన్యాసాలను వీడియో తీయించి, సోషల్ మీడియాలో వైరల్ చేస్తే బాగుంటుందనే వింత ఆలోచన వచ్చింది. అదే సమయానికి అక్కడ పోగైన జనం అతడి విన్యాసాలను ఆశ్యర్యంగా చూస్తుండటంతో.. రెచ్చిపోయిన ఈ పెద్దాయన ఈసారి ఏకంగా ఆ పామును ముద్దాడే ప్రయత్నం చేశాడు. అంతే.. ఒక్కసారిగా ఆ పాము అతడి నాలుకమీద కాటేసింది.
పాము కాటేయటం చూసిన జనమంతా బిగ్గరగా హాహాకారాలు చేశారు. దీంతో అతడు పామును వదిలేయగా, అది నెమ్మదిగా అక్కడి పొదల్లోకి జారుకుంది. అంతలోనే.. జితేంద్ర కుమార్ కళ్లు తిరిగి నేల మీద పడిపోగా, గ్రామస్తులు అతడిని హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు. అతడిని పరిశీలించిన వైద్యులు వెంటనే మెరుగైన వైద్యం అందించారు. మరో నాలుగైదు రోజులు గడిస్తే తప్ప ఇప్పుడే ఏమీ చెప్పలేమని వారు వెల్లడించారు. కాగా, స్టంట్ సమయంలో జితేంద్ర కుమార్ మద్యం మత్తులో ఉన్నాడని, పొగతాగుతూనే పాముతో ఆటలాడాడని స్థానికులు చెబుతున్నారు. ఇంకొందరేమో.. నడివయసు కొచ్చాక కూడా ఈ పిల్ల చేష్టలేంటని విసుక్కుంటున్నారు.
ये कला दिखा रहे थे तभी सांप ने डस लिया. अब ये जिंदगी और मौत के बीच ICU में जंग लड़ रहे हैं. ये अपने गांव में अक्सर इस तरह की कलाकारी किया करते थे. लेकिन इस बार इन्हें सांप को Kiss करना महंगा पड़ गया. घटना यूपी अमरोहा की है. pic.twitter.com/15ZMYyz3c9
— Priya singh (@priyarajputlive) June 14, 2025