Viral Video: ఇది కదా టైమింగ్.. దేవుని లెక్కనే కాపాడిండులె!… గుండెపోటు వచ్చిన వెంటనే ఇలా చేయాలన్నమాట!!

అరోగ్యంగా ఉండే వ్యక్తులకైనా ఎప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్య తలెత్తుతుందో ఎవరూ ఊహించలేరు. నడుచుకుంటూ వెళ్లే వ్యక్తి సడెన్‌గా కుప్పకూలిపోవచ్చు. జిమ్‌లో వర్కౌట్లు చేసే యువకులకు హఠాత్తుగా హార్ట్‌స్ట్రోక్‌ రావొచ్చు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే...

Viral Video: ఇది కదా టైమింగ్.. దేవుని లెక్కనే కాపాడిండులె!... గుండెపోటు వచ్చిన వెంటనే ఇలా చేయాలన్నమాట!!
Heart Attack Cpr

Updated on: Dec 15, 2025 | 4:38 PM

అరోగ్యంగా ఉండే వ్యక్తులకైనా ఎప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్య తలెత్తుతుందో ఎవరూ ఊహించలేరు. నడుచుకుంటూ వెళ్లే వ్యక్తి సడెన్‌గా కుప్పకూలిపోవచ్చు. జిమ్‌లో వర్కౌట్లు చేసే యువకులకు హఠాత్తుగా హార్ట్‌స్ట్రోక్‌ రావొచ్చు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే సరిగ్గా అలాంటి సమయంలోనే పక్కన ఉన్న వ్యక్తులు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే ప్రాణాలు దక్కొచ్చని ఈ వైరల్ వీడియో నిరూపిస్తోంది.

ఉత్తరప్రదేశ్‌లో జరిగిందీ సంఘటన. ఒక వ్యాపారవేత్త గుండెపోటుతో నేలపై కుప్పకూలిపోయాడు. రాజీవ్‌గా గుర్తించబడిన ఆ వ్యాపారవేత్తకు సకాలంలో కార్డియోపల్మనరీ రిససిటేషన్ (CPR) అందించడంతో అతను అదృష్టవశాత్తూ గుండెపోటు నుండి బయటపడ్డాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.

వైరల్‌ వీడియలో ఓ ఇంటి ముందు కారులో నుంచి ఇద్దరు వ్యక్తులు దిగడం చూడొచ్చు. రాజీవ్‌ అనే వ్యక్తికి గుండెపోటు రావడంతో వెంటనే ఆయన నేలపై కుప్పకూలిపోయాడు. తన స్నేహితుడైన తోటి వ్యాపార వేత్త సోను చుగ్‌ గమనించి వేగంగా స్పందించడం వీడియోలో కనిపిస్తుంది. అతినికి సకాలంలో సీపీఆర్‌ చేసి ప్రాణాలను కాపాడటం కనిపిస్తుంది.

ఆ ఇంటి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ దురదృష్టకర సంఘటన డిసెంబర్ 7, ఆదివారం నాడు ఉత్తరప్రదేశ్‌లోని హాపుర్‌లో జరిగినట్లుగా తెలుస్తోంది. వైరల్‌ వీడియోపై నెటిజన్లు ఆసక్తికరంగా కామెంట్స్‌ పెడుతున్నారు.

వీడియో చూడండి: