
లక్నోలో ప్రధాని మోదీ నిన్న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాష్ట్రీయ ప్రేరణా స్థల్ నుంచి వేలాది పూలకుండీలను స్థానికులు ఎత్తుకెళ్లడం తీవ్ర కలకలం రేపింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించిన మరుసటి రోజు నుంచే పూల కుండీలను ఎత్తుకెళ్లడంపై స్థానికులు మండిపడుతున్నారు. పోలీసు సెక్యూరిటీ ఏర్పాటు చేసినప్పటికి పూలకుండీలను ఎత్తుకెళ్లడం సంచలనం సృష్టించింది.
ఇప్పటివరకు నాలుగు వేల పూలకుండీలను ఎత్తుకెళ్లినట్టు అధికారులు గుర్తించారు. పిల్లలు సైకిళ్ల మీద , పెద్దలు ఆటోల్లో , టూవీలర్స్‌పై వచ్చి పూలకుండీలను ఎత్తుకెళ్లారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వాజ్‌పేయి 101 జయంతి సందర్భంగా లక్నోలో రాష్ట్రీయ ప్రేరణా స్థల్‌ను ఆవిష్కరించారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమానికి యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ హాజరయ్యారు. ప్రేరణా స్థల్‌లో 65 అడుగుల వాజ్‌పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. భారతమాత విగ్రహానికి నివాళి అర్పించారు. రూ.230 కోట్లతో రాష్ట్రీయ ప్రేరణా స్థల్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రేరణా స్థల్‌లో జరిగిన సభకు లక్షలాదిమంది హాజరయ్యారు.
సభకు యూపీ సర్కార్ గ్రాండ్‌గా ఏర్పాట్లు చేసింది. నగరం మొత్తం రంగురంగుల పూలతో అలంకరించింది. సభా ప్రాంగణం వద్ద వేల కొద్దీ పూల కుండీలతో డెకరేట్ చేసింది యోగీ ప్రభుత్వం. అయితే సభ అనంతరం ఇలా పూలకుండీలను స్థానికులు ఎత్తుకెళ్లారు. వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.
People were seen stealing flower pots in Lucknow after the PM’s program concluded.
Not an uncommon sight in India and explains why municipalities remove flower pots once events end. Ironically, those stealing them are usually not poor but from economically sound households. pic.twitter.com/qTcJX8LLrT
— THE SKIN DOCTOR (@theskindoctor13) December 26, 2025