Viral Video: మీ చిన్నతనంలో ఇలాంటి తుంటరి గేమ్‌ ఎప్పుడైనా ఆడారా.. పగలబడి నవ్వుతారు..!

Viral Video: బాల్యంలో చేసిన పనులు అందరికి గుర్తుంటాయి. వాటిని తలుచుకున్నప్పుడు మనసుకి చెప్పలేని ఆనందం కలుగుతుంది. కానీ పెద్దయ్యాక అందరు చదువులు,

Viral Video: మీ చిన్నతనంలో ఇలాంటి తుంటరి గేమ్‌ ఎప్పుడైనా ఆడారా.. పగలబడి నవ్వుతారు..!
Kids Playing

Updated on: Apr 25, 2022 | 3:20 PM

Viral Video: బాల్యంలో చేసిన పనులు అందరికి గుర్తుంటాయి. వాటిని తలుచుకున్నప్పుడు మనసుకి చెప్పలేని ఆనందం కలుగుతుంది. కానీ పెద్దయ్యాక అందరు చదువులు, ఉద్యోగాల కోసం పరుగెడుతుంటారు. కానీ ఎక్కడో చోట ఆడుకుంటున్న పిల్లలని చూసినప్పుడు మీకు కచ్చితంగా బాల్యం గుర్తుకువస్తుంది. మీరు గ్రామాల్లో నివసించినట్లయితే చిన్నప్పుడు పిల్లలు వాహన టైర్లతో ఎలా ఆడుకుంటారో అందరికి తెలిసిందే. తాజాగా ఓ టైర్‌ ఆటకి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. మీరు కూడా ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోవడం చాలా కష్టం. ఇంతకీ వీడియోలో ఏం జరిగిందో తెలుసుకుందాం.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో కొంతమంది పిల్లలు ఒక వాహన టైరులో ఒక పిల్లాడిని కూర్చోబెడుతారు. తర్వాత అందరు కలిసి గుట్టపై నుంచి ఆ టైరుని కిందికి వదులుతారు. దీంతో ఆ టైరులో ఉన్న పిల్లాడు కొంతదూరం వరకు బాగానే వెళుతాడు. చివరలో టైరు నుంచి బయటికి వస్తాడు. టైరు ఒకవైపు పిల్లాడు ఒకవైపు దొర్లుతూ వెళుతారు. ఈ ఘటనలో దాదాపు పిల్లవాడికి చాలా దెబ్బలు తగిలి ఉంటాయి. కానీ నెటిజన్లు పిల్లలు చేసిన ఈ తమాషా పనికి పగలబడి నవ్వుకుంటున్నారు. రకరకాల కామెంట్లతో వారి స్పందనని తెలియజేస్తున్నారు. ఈ ఫన్నీ వీడియోని ఒక నెటిజన్‌ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఈ వీడియో ఇప్పటివరకు 6 లక్షల 43 వేల వ్యూస్‌ని అందుకుంది. అయితే 7 వేల మందికి పైగా వీడియోను లైక్ చేసారు. వీడియో చూసిన ప్రజలు వివిధ రకాల రియాక్షన్‌లు ఇచ్చారు. మీరు కూడా ఈ వీడియో చూసినట్లయితే మీ కామెంట్‌ తెలియజేయండి.

IPL 2022: సెంచరీతో మ్యాన్‌ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌ కొట్టేశాడు.. కానీ 24 లక్షల ఫైన్‌ కూడా కట్టాడు..!

Detox Drinks: ఈ 5 డిటాక్స్‌ డ్రింక్స్‌తో సులువుగా బరువు తగ్గండి..!

Military Expenditure: తగ్గేదేలే.. ఆ విషయంలో అమెరికా, చైనా తర్వాత ఇండియానే..!

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి