Viral Video: బురదలో చిక్కుకున్న జేసీబీకి మరొక జేసీబీ హెల్ప్‌.. వైరల్‌ అవుతున్న వీడియో..

|

Mar 11, 2022 | 11:31 AM

Viral Video: ఆపదలో ఉన్నవారికి సాయం చేయడం మనిషి ధర్మం. సాయం చేయాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఒక్కసారి ఎవరికైనా సాయం చేస్తే అందులో ఉండే ప్రశాంతత వేరు.

Viral Video: బురదలో చిక్కుకున్న జేసీబీకి మరొక జేసీబీ హెల్ప్‌.. వైరల్‌ అవుతున్న వీడియో..
Jcb Viral Video
Follow us on

Viral Video: ఆపదలో ఉన్నవారికి సాయం చేయడం మనిషి ధర్మం. సాయం చేయాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఒక్కసారి ఎవరికైనా సాయం చేస్తే అందులో ఉండే ప్రశాంతత వేరు. ఆనందానికి భిన్నమైన అనుభూతి దొరుకుతుంది. సోషల్‌ మీడియాలో హెల్ప్‌ వీడియోలు చాలా కనిపిస్తాయి. తాజాగా ఇప్పుడు ఒక వీడియో వైరల్‌ అవుతుంటుంది. అయితే ఇక్కడ మనుషులు కాదు.. యంత్రాలు ఒకరికొకరు సాయం చేసుకోవడం కనిపిస్తుంది. ఈ వీడియో పూర్తిగా ప్రత్యేకమైనది. మీరు ఇంతకు ముందు ఇలాంటిది చూసి ఉండరు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఒక JCB మరొక JCBకి సహాయం చేయడం కనిపిస్తుంది. వాస్తవానికి ఒక జేసీబీ బురదలో కూరుకుపోయి ఉండడాన్ని వీడియోలో మనం చూడవచ్చు. దానిని బయటికి తీసుకురావడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ అతడి వల్ల కాదు. దీంతో ఏం చేయలేక మరో జేసీబీ సాయం కోరుతాడు. రెండో జేసీబీ కుర్రాడు బురదలో చిక్కుకున్న జేసీబీని నెమ్మదిగా బయటకి లాగుతాడు. ఈ వీడియో ‘హెల్పింగ్ హ్యాండ్’కి గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది.

ఈ వీడియోని ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. క్యాప్షన్‌లో ‘హెల్పింగ్ హ్యాండ్’ అని పేర్కొన్నారు. ఈ 28 సెకన్ల వీడియోకి ఇప్పటివరకు 2500 కంటే ఎక్కువ వ్యూస్‌ వచ్చాయి. వందలాది మంది వీడియోను లైక్ చేసారు. అదే సమయంలో వీడియో చూసిన చాలామంది నెటిజన్లు రకరకాల రియాక్షన్‌లు ఇచ్చారు. ఒక యూజర్ ‘డబుల్ ఇంజన్’ అని రాయగా, మరో యూజర్ ‘నిన్ను నమ్ముకుంటే అందరికి చేయూత’ అంటూ కవితా శైలిలో వ్యాఖ్యానించాడు. అలాగే మరొక యూజర్ ‘ఇద్దరు సోదరుల మధ్య చాలా ప్రేమ ఉందంటూ ఫన్నీగా వ్యాఖ్యానించాడు. మీరు కూడా ఈ వీడియో చేస్తే మీ కామెంట్‌ తెలపండి.

ICC Women World Cup 2022: ప్రపంచకప్‌లో వెనుకబడుతున్న టీమ్‌ ఇండియా.. ఒకటి గెలుపు మరొకటి ఓటమి..

Viral Video: ఎండిపోయిన చెట్టుని అద్భుత బొమ్మగా మలిచిన తీరు అద్భుతం.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..

ISI Mark: ఇకనుంచి వాటికి ISI మార్క్.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్ణయం..