Viral Video: అది కేవలం గుడిసె అనుకుంటివా మచ్చా.. లోనికెళ్లి చూడు… పేదరికం ఇంత అందంగా ఉంటే ఎంత బాగుంటుంది

మన దేశంలో జీవించే విధానాన్ని బట్టి ధనికులు, పేదలుగా నిర్ణయిస్తుంటారు. బంగ్లాలో ఉండేవారికి ఒక విధంగా, గుడిసెలో ఉండేవారికి మరో విధంగా సమాజంలో గౌరవ మర్యాదలు దక్కుతుంటాయి. మారుతున్న జీవన శైలి కారణంగా అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కరోనా వచ్చిన తర్వాత మనుషులు నగరాల వెలుపల...

Viral Video: అది కేవలం గుడిసె అనుకుంటివా మచ్చా.. లోనికెళ్లి చూడు... పేదరికం ఇంత అందంగా ఉంటే ఎంత బాగుంటుంది
Poor Hut Rich Facilities

Updated on: Jun 26, 2025 | 5:00 PM

మన దేశంలో జీవించే విధానాన్ని బట్టి ధనికులు, పేదలుగా నిర్ణయిస్తుంటారు. బంగ్లాలో ఉండేవారికి ఒక విధంగా, గుడిసెలో ఉండేవారికి మరో విధంగా సమాజంలో గౌరవ మర్యాదలు దక్కుతుంటాయి. మారుతున్న జీవన శైలి కారణంగా అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కరోనా వచ్చిన తర్వాత మనుషులు నగరాల వెలుపల జీవించడానికి ఇష్టపడుతున్నారు. ఎట్‌లీస్ట్‌ వారాంతాల్లోనైనా ట్రాఫిక్‌, పొల్యూషన్‌ వంటి వాటి నుంచి దూరంగా ఉండేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సిటీలో రిచ్‌లైఫ్‌ను విడిచిపెట్టి గుడిసెల్లో సేదతీరుతున్నారు. ప్రస్తుతం అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్‌ మీడియలో చక్కర్లు కొడుతోంది.

అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూసి నెటిజన్స్‌ నోరెళ్లబెతున్నారు. ఆ వీడియో చూసిన చాలా మంది సోషల్‌ మీడియా యూజర్స్‌ మాకు కూడా అలాంటి పేద బతుకే కావాలని కోరుకుంటున్నారు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో రోడ్డు పక్కన చెట్ల మధ్యలో చిన్న గుడిసె కనిపిస్తుంది. ఆయితే గుడిసెలోని సెటప్‌ మాత్రం మామూలుగా లేదు.

గుడిసె బయట ఏసీ అవుట్ డోర్ యూనిట్ కనబడుతోంది. ఆ గుడిసె లోపలికి వెళ్లి చూస్తే మైండ్‌ బ్లోయింగ్‌ సీన్‌ కనపడతుంది. లోపల ఏసీ, మినీ ఫ్రిడ్జ్ ఉన్నాయి. ఓ వ్యక్తి డబుల్ కాట్ బెడ్ మీద హాయిగా పడుకుని ఎల్‌ఈడీ టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు. ఇది వీఐపీ టెంట్ అని ఒకరు కామెంట్ చేస్తే.. నేను కూడా ఇలాంటి పేద బతుకును కోరుకుంటున్నా అని మరొకరు పోస్టు పెట్టారు. పేదరికం అనేది ఇంత అందంగా మారిపోతే ఎంత బాగుంటుంది అని మరొకరు పోస్టు పెట్టారు.

వీడియో చూడండి: