టీ.. ఉదయాన్నే ఒక సిప్ పడితే కానీ పనులు మొదలవ్వవు. భారతీయులు అంత ఇంపార్టెంట్ ఇస్తారు దీనికి. ఇక కొంత మంది అయితే టీ పడితే కానీ మంచం దిగరు. భారత దేశంలో టీకి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. నీరసంగా, అలసటగా ఉన్నప్పుడు ఒక టీ పడితే మెదడు చురుకుగా పని చేస్తుంది. నిద్రమత్తును పటా పంచలు చేస్తుంది. ఒక్కొక్కరి ఇష్టం ప్రకారం.. కొంత మంది అల్లం టీ, బాదం టీ, యాలకుల టీ, దాల్చిన చెక్క టీ, మసాలా టీ లేదా నార్మల్ టీ వంటివి తాగుతూంటారు. మరి కొంత మంది ఈ టీతో బన్ లేదా బిస్కెట్స్ కూడా తింటూంటారు. టీలో చాలా రకాలు ఉన్నాయి.
అయితే పచ్చి గుడ్డుతో, పండ్లతో టీ చేయడం మీరు ఎప్పుడైనా విన్నారా? సాధారణంగా టీ తాగక ముందు కానీ, టీ తాగిన వెంటనే పండ్లను, గుడ్డును తినకూడదని ఆహార నిపుణులు చెబుతూంటారు. మరి టీలో పండ్లు, గుడ్లు ఏంటని షాక్ అవుతున్నారా. టీలో ఎన్నో ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ ‘ఎగ్ టీ’ కూడా అలాగే వైరల్ గా మారింది. మరి టీ సంగతి ఏంటో చూద్దాం రండి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాటిలో ఈ ఎగ్ టీ కూడా ఒకటి. ఒక లేడీ యూ ట్యూబర్ ఎగ్ టీని ఎలా చేసిందో చూపించింది. ముందుగా టీ గిన్నె పెట్టుకుని అందులో షుగర్, టీ పొడి వేసి వేయించింది. ఇప్పుడు యాపిల్ ని ముక్కలుగా కోసి వేసి వేయించింది. ఇప్పుడు ఒక గ్లాస్ పాలు పోసి కాసేపు మరగ బెట్టింది. ఇప్పుడు కావాలనుకున్న వారు పాల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చని తెలిపింది. నెక్ట్స్ ఇది కాసేపు మరిగాక పచ్చి గుడ్డును పగుల కొట్టి వేసి.. బాగా కలిపింది. కాసేపు ఆగాక దాల్చిన చెక్క, యాలకులు వేసింది. ఇలా కాసేపు ఆ టీని కలుపుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆ టీని ఓ కప్పులో సర్వ్ చేసింది. ఈ టీ రెసిపీకి సంబంధించిన వీడియో నెట్టింట్ వైరల్ గా మారింది. సాధారణంగా టీ తాగే వారికి ఈ ఎగ్ టీని చూస్తే మాత్రం నిజంగా అసహ్యించుకుంటారు.
ఈ వీడియోకు బోలెడన్ని కామెంట్స్ వస్తున్నాయి. ఆ టీ తాగిన వాళ్లు బతికే ఉన్నారా? అని, అసలు నువ్వు ముందు ఆ టీ తాగి చూపించు,.. అబ్బా నా లైఫ్ లో ఇంత అసహ్యమైన టీని ఇప్పుడే చూస్తున్నా,.. వావ్.. వాటే టాలెంట్ అంటూ మరికొంత మంది చతుర్లు విసురుతూ ఉన్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..