Viral Video: ఒకే ఉయ్యాల్లో ఊగుతున్న ముగ్గురు అమ్మాయి.. హఠాత్తుగా ఏమి జరిగిందంటే.. ఫన్నీ వీడియో వైరల్

|

Aug 13, 2022 | 10:25 AM

వైరల్ అవుతున్న ఈ వీడియోలో గ్రామంలోని కొందరు అమ్మాయిలు చెట్టుకి కట్టిన ఊయల్లో ఆనందంతో ఊగుతున్నారు.  అయితే ఈ ఊయల్లో ముగ్గురు అమ్మాయిలు ఒకేసారి ఊగడం విశేషం..

Viral Video: ఒకే ఉయ్యాల్లో ఊగుతున్న ముగ్గురు అమ్మాయి.. హఠాత్తుగా ఏమి జరిగిందంటే.. ఫన్నీ వీడియో వైరల్
Viral Video
Follow us on

Viral Video: వర్షాకాలం (Monsoon season)కొనసాగుతోంది.. అత్యంత ఆహ్లాదకరమైన సీజన్. ఈ సమయంలో విభిన్నమైన ప్రకృతి సౌందర్యం కనిపిస్తుంది. పచ్చదనం, పువ్వుల పరిమళంతో ఈ నెల అందరిని ఆకట్టుకుంటుంది. ఈ ప్రకృతిని దానిలోని అందాలను ఎంజాయ్ చేయడానికి ఊయలని ఆశ్రయిస్తాం.. చెట్టుకు ఊయలని వేలాడదీసుకుని ఊగుతూ.. పుడమిలోని అందాలను ఎంజాయ్ చేయడం యూత్ కు ఇష్టం.. అయితే చెట్టుకు ఊయల వేసుకుని ఊగే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతె ఊయల సరదా.. ఒక్క క్షణంలో మారిపోవచ్చు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక సన్నివేశం అటువంటిదే కనిపించింది.

చెట్టుకు తాళ్లతో కట్టిన ‘దేశీ ఊయల’పై యువతీ యువకులు ఇష్టంగా ఊగుతూ ఉంటారు. ఇలాంటి వీడియోలు తరచుగా  కనిపిస్తూఉంటాయి. అయితే ఇలాంటి సరదా చాలాసార్లు ప్రమాదాలుగా మారడానికి ఇదే కారణం కావచ్చు. ఆడపిల్లలు సరదాగా ఊయలను ఊగుతూ ఎంజాయ్ చేస్తున్న వీడియో ఒకటి తెరపైకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

 

వైరల్ అవుతున్న ఈ వీడియోలో గ్రామంలోని కొందరు అమ్మాయిలు చెట్టుకి కట్టిన ఊయల్లో ఆనందంతో ఊగుతున్నారు.  అయితే ఈ ఊయల్లో ముగ్గురు అమ్మాయిలు ఒకేసారి ఊగడం విశేషం.. ఒక అమ్మాయి ఊయల బల్లమీద కూర్చుండగా.. ఆ చెక్కకి ఇరువైపులా ఇద్దరు అమ్మాయిలు నిల్చుని ఉన్నారు.. ముగ్గురు.. ఊయలను ఊగుతూ.. పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.. అయితే  క్రమంగా ఊయల స్పీడ్  పెరిగింది. దీంతో ఆ ఊయల బరువుని తట్టుకోలేక తెగిపోయింది. స్పీడ్ లో ఊయల చెట్టుకింద కొంచెం దూరంలో పడింది. దీంతో ఇద్దరు అమ్మాయిలు కిందపడిపోయారు. మూడో అమ్మాయి మాత్రం విరిగిన ఊయలకు వేలాడుతూ ఊగుతూనే ఉంది. క్షణంలో అమ్మాయిల సరదా.. ప్రమాదంగా మారిపోయింది. ఆ అమ్మాయిలు పడిన తీరు చూస్తుంటే తీవ్రంగా గాయపడినట్లు అనిపిస్తుంది.

ఈ వీడియో mrsingh8394 పేరుతో Instagramలో  షేర్చే చేశారు. శ్రావణ మాసం సరదా అనే క్యాప్షన్ కూడా ఈ వీడియోకి ఇచ్చారు. ఈ వీడియోకి మిలియన్ల కొద్దీ వీక్షణలు, కామెంట్‌లు వచ్చాయి. రకరకాల కామెంట్స్ ను సొంతం చేసుకుంది ఈ వీడియో..

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండి..