Wedding Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోల్లో పెళ్లికి (Marriage Funny video) సంబంధించినవిగా కూడా చాలా ఉంటాయి. పెళ్లి వీడియోల్లో ఎక్కువగా నవ్వులు తెప్పించేవే ఉంటాయి. వివాహం సందర్భంగా కొంతమంది డ్యాన్స్ వేస్తుంటారు.. మరికొంతమంది పాడుతుంటారు. అంతేకాకుండా ఒకరిపై ఒకరు డబ్బును కూడా వెదజల్లుకుంటుంటారు. వరుడిపై డబ్బు వేస్తుంటే.. వేరే వారు వాటిని తీసుకుంటుంటారు. అయితే తాజాగా మీరు చూసే వీడియో కొంత డిఫెరెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు మేము చూపించబోయే వీడియోను (Viral Video) మీరు ఇంతకు ముందెన్నడూ చూసి ఉండరు. ఎందుకంటే వివాహవేడుకలో వధూవరులే.. డబ్బును దొచుకుంటారు. ఇది చూసినవారంతా తెగనవ్వుకుంటుంటారు. అయితే వరుడు చేసిన పనికి వధువు కూడా మద్దతు పలుకుతుంది.
వైరల్ అవుతున్న వీడియోలో.. వధూవరులు వేదికపై నిలబడి చాలా సంతోషంగా కనిపించడాన్ని మీరు చూడవచ్చు. ఈ సమయంలో అక్కడ ఉన్నవారు వారిపై డబ్బును వెదజల్లుతారు. ఈ క్రమంలో వేదికపై నోట్లు చెల్లాచెదురుగా పడటంతో కొందరు దోచుకోవడం ప్రారంభిస్తారు. ఇంతలో పెళ్లికొడుకు తన కాళ్ల దగ్గర ఉన్న 2వేల నోటును తీసుకుని జేబులో పెట్టుకుంటాడు. ఆ తర్వాత వధువు కూడా తనకు దొరికిన డబ్బును దాచిపెట్టమని.. సైగ చేసి వరుడికి ఇస్తుంది. ఇదంతా చూసి అక్కడున్న వారంతా తెగ నవ్వుకుంటున్నారు. ముందు ఈ ఫన్నీ వీడియో చూడండి.
వైరల్ వీడియో..
సోషల్ మీడియా వినియోగదారులు ఈ ఫన్నీ వీడియోను చూసి తెగ నవ్వుకుంటున్నారు. ఇద్దరు ఇద్దరే అంటూ పలు కామెంట్లు చేస్తున్నారు. బావుంది జోడి అంటూ ఫన్నీగా వ్యాఖ్యలు రాస్తున్నారు. ఈ వెడ్డింగ్ ఫన్నీ వీడియోను కుల్దీప్‌కౌశిక్ 1 అనే యూజర్ సోషల్ మీడియా సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీనిని లక్షలాది మంది వీక్షించారు.
Also Read: