
నిశ్చితార్థం అయితే అయింది.. ఇక పెళ్లితో ఏం పని అనుకున్నారో ఏమో..ఓ డాక్టర్ డ్యూటీలో ఉండగానే కాబోయే భార్యతో ఆస్పత్రిలోనే డ్యాన్సులతో రెచ్చిపోయాడు. ఉత్తర ప్రదేశ్‌లోని షామ్లి జిల్లా నుండి వచ్చిన ఒక వీడియో ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టిస్తోంది. దీనిలో ప్రభుత్వ వైద్యుడు అఫ్కర్ సిద్ధిఖీ కాంధ్లా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పై అంతస్తులోని డ్యూటీ రూమ్‌లో తన కాబోయే భార్యతో కలిసి “దమ్ దమ్ దమ్ మస్త్ హై” పాటకు నృత్యం చేస్తున్నట్లు చూపిస్తుంది.
చొక్కా మరియు లోయర్ జాకెట్ ధరించిన వైద్యుడు తన నిశ్చితార్థాన్ని జరుపుకుంటున్నట్లు కనిపిస్తోంది. కానీ వేదిక ఎంపికపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రోగుల కోసం ఉద్దేశించిన ప్రభుత్వ ఆసుపత్రి గదిని వ్యక్తిగత నృత్య ప్రదేశంగా ఎందుకు ఉపయోగించారని స్థానికులు ప్రశ్నించారు. వీడియో వైరల్ కావడంతో మెడికల్ సూపరింటెండెంట్ వివరణ కోరుతూ నోటీసు జారీ చేశారు. వైద్యుడిని అధికారిక గృహాలను ఖాళీ చేయమని కోరారు.
అధికారులు ఈ చర్యను సీరియస్‌గా తీసుకున్నారు. ఆసుపత్రి గౌరవానికి భంగం కలిగించే విధంగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీడియో చూసిన నెటిజన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొంతమంది వైద్యుడికి సపోర్టు చేస్తుండగా .. ఎక్కువ శాతం మాత్రం వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
यूपी –
शामली जिले के एक सरकारी अस्पताल के ड्यूटी रूम में डॉक्टर का डांस, CMO ने नोटिस देकर जवाब मांगा !!कहा जा रहा है कि डॉक्टर अफकार सिद्दीकी सगाई की खुशी में डांस कर रहे हैं और साथ में डांस करने वाली उनकी मंगेतर है। pic.twitter.com/q7FWRs7xdV
— Sachin Gupta (@SachinGuptaUP) November 21, 2025