Viral Video: భారీ మొసలితో కలిసి ఓ మనిసి ఈత కొట్టడం చూశారా..? వైరల్‌ వీడియోతో నెటిజన్స్‌ షాక్‌!

భయంకరమైన జంతువుల్లో మొసలి ఒకటి. నీటిలో ఉన్న మొసలికి చిక్కిన ఎంతటి బలవంతమైన జంతువైనా సరే దానికి ఆహారం అయిపోవాల్సిందే. అందుకే మొసలిని చూస్తే ప్రతి ఒక్కరు వణికిపోతుంటారు. అలాంటిది ఓ వ్యక్తి దానితో ఏకంగా స్విమ్మింగ్‌ పూల్‌లో జలకాలాడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు...

Viral Video: భారీ మొసలితో కలిసి ఓ మనిసి ఈత కొట్టడం చూశారా..? వైరల్‌ వీడియోతో నెటిజన్స్‌ షాక్‌!
Swim With Alligator

Updated on: Aug 07, 2025 | 6:33 PM

భయంకరమైన జంతువుల్లో మొసలి ఒకటి. నీటిలో ఉన్న మొసలికి చిక్కిన ఎంతటి బలవంతమైన జంతువైనా సరే దానికి ఆహారం అయిపోవాల్సిందే. అందుకే మొసలిని చూస్తే ప్రతి ఒక్కరు వణికిపోతుంటారు. అలాంటిది ఓ వ్యక్తి దానితో ఏకంగా స్విమ్మింగ్‌ పూల్‌లో జలకాలాడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. సర్కస్ ప్రదర్శనకారుడిగా ఉన్న ఒక జర్మన్ వ్యక్తి తన ఇంట్లో 8 అడుగుల పొడవైన నల్లటి మొసలితో స్విమ్మింగ్‌ చేస్తున్న వీడియో నెటిజన్స్‌ను షేక్‌ చేస్తోంది.

ఈ మొసలి కూడా 30 సంవత్సరాలకు పైగా సర్కస్‌లో ప్రదర్శన ఇచ్చిందని చెబుతారు. సర్కస్‌ మ్యాన్‌ క్రిస్టియన్ కౌలిస్ ఆ మొసలితోనే పెరిగాడని ఇప్పుడు తన కుటుంబంతో కలిసి కొలనులో నివసిస్తుందని అంతర్జాతీయ మీడియా నివేదిక పేర్కొంది. ఫ్రౌ మేయర్ అని పిలువబడే ఈ మొసలి, కౌలిస్ కుటుంబంతో ఒక పెద్ద కొలనులో నివసిస్తుంది. ఈ కొలనులో మొసలికి అనుకూలంగా నీటిని మార్చేయడానికి థర్మల్ లైటింగ్ కూడా ఉంది. మొసలి తరచుగా దాని స్నేహితుడు క్రిస్టియన్‌తో కలిసి ఈత కొడుతూ సూర్యరశ్మి ఆస్వాదిస్తూ కనిపిస్తుంది.

క్రిస్టియన్ చిన్నతనంలో ఉండగానే మొసలికి దగ్గరయ్యాడు. అది అతనికి పెద్ద సోదరి లాంటిదని చెప్పాడు. పిల్లలంతా టెడ్డీ బేర్‌తో ఆడుకునేటప్పుడు, తాను మాత్రం ఎల్లప్పుడూ మొసలితోనే ఉండేవాడిని చెప్పారు. “నేను తనను ఎప్పుడూ నమ్ముతాను. తాను మాకు అక్క లాంటిది. దాని గురించి ఎటువంటి సందేహం లేదు కానీ నేను ఆమెను 100% నమ్ముతాను. నేను ఏమి చేస్తున్నానో ఆమెకు తెలుసు. అని క్రిస్టియన్‌ చెప్పారు.

వీడియో చూడండి:

 

 

క్రిస్టియన్ తండ్రి మొసలిని 2 సంవత్సరాల వయసులో తీసుకువచ్చాడని, సర్కస్‌లో ప్రదర్శన ఇచ్చేవాడని నివేదించబడింది. ఆ మొసలి దాదాపు 100 కిలోల బరువు ఉంటుంది. వారానికి ఒకసారి మాత్రమే భోజనం అవసరం. దాని భోజనంలో కోడి కాళ్ళు, గొడ్డు మాంసం, చేపలు లేదా ఎలుక ఉంటాయి.