Viral Video: సరదాగా ఇంట్లో వాడిన మెటల్‌ డిటెక్టర్‌.. గోడలో దొరికింది ఊహించని నిధి..! వీడియో చూస్తే అవాక్కే..

అదృష్టం ఎప్పుడు తలుపు తడుతుందో ఎవరికీ తెలియదని అంటారు. కేవలం సరదా కోసం తమ ఇంట్లో మెటల్ డిటెక్టర్‌ను ఉపయోగించిన ఒక కుటుంబంలో కూడా ఇలాంటిదే జరిగింది. ఏదో సరదా కోసం ఒక కుటుంబం తమ ఇంట్లో మెటల్‌ డిటెక్టర్‌ను ఉపయోగించి గోడ లోపల దాగి వున్న రహస్యాన్ని వెలికితీసింది. వీడియో వైరల్‌గా మారడంతో వారిలో ఇంట్లో ఊహించని నిధి దొరికిందనే ఊహాగానాలు చెలరేగాయి. ఇంతకీ వారి ఇంట్లో లభించిన ఆ నిధి ఏంటో తెలియాలంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..

Viral Video: సరదాగా ఇంట్లో వాడిన మెటల్‌ డిటెక్టర్‌.. గోడలో దొరికింది ఊహించని నిధి..! వీడియో చూస్తే అవాక్కే..
Hidden Treasure

Updated on: Oct 05, 2025 | 5:01 PM

సోషల్‌ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. వాటిలో కొన్ని వీడియోలు మనల్ని షాక్‌ అయ్యేలా చేస్తాయి. మరికొన్ని ఆశ్చర్యపోయేలా చేస్తుంటాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా. వైరల్‌గా మారిన ఈ వీడియోలో ఒక కుటుంబం తమ ఇంట్లో మెటల్ డిటెక్టర్‌ను ఉపయోగించి గోడ లోపల దాగి ఉన్న ఒక మర్మమైన పెట్టెను వెలికితీసింది. గోడకు దగ్గర పరిశీలిస్తున్నప్పుడు మెటల్ డిటెక్టర్ బీప్ శబ్దం చేయడం ప్రారంభించింది. దాంతో వారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ గోడను పగలగొట్టడం ప్రారంభించారు. ఆపై లోపల దాగి ఉన్న నిధిని కనుగొన్నారు..!

ఇందుకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వేగంగా వైరల్ అవుతోంది. దీనిని jackcharlesefaisca అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు గోడపై మెటల్ డిటెక్టర్‌ను తిప్పుతున్నట్లు చూపిస్తుంది. అకస్మాత్తుగా గోడ నుండి బీప్ శబ్దం రావడం ప్రారంభమవుతుంది. ఆ శబ్దం ఎక్కడి నుండి వచ్చిందనే విషయం కన్ఫామ్‌ చేసుకోవడానికి వారు మెటల్ డిటెక్టర్‌ను రెండుసార్లు అక్కడే తిప్పుతారు. ఆ గోడలో నుండి శబ్ధం వచ్చిందని వారు పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత వారు గోడను పగలగొట్టడం ప్రారంభిస్తారు. గోడను పగలగొట్టిన తర్వాత లోపల ఏదో ఒక పెట్టెను వారు గుర్తించారు. దాని లోపల కొన్ని విలువైన వస్తువులు మరేదైనా విలువైన నిధి దాచిపెట్టి ఉండవచ్చని వీడియో చూసిన వారంతా భావించారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను jackcharlesefaisca అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. షేర్ చేసిన వెంటనే ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. దీనిని 20 మిలియన్లకు పైగా ప్రజలు వీక్షించారు. 200,000 మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియో చూస్తుంటే చాలా మందిలో ఆసక్తి పెరిగింది. ఈ పాత పెట్టెలో నిజంగా ఏముందో అని ఆలోచిస్తున్నారా?

వీడియో ఇక్కడ చూడండి..

అలాగే, కొందరు నెటిజన్లు వీడియోపై ఫన్నీ కామెంట్స్ చేశారు. ఆ పక్కన ఉంది మీ బెడ్‌రూమ్‌ బ్రో.. నువ్వు బెడ్ రూమ్ తలుపు తెరిచి చూస్తే సరిపోయేది అని రాశారు. మరొకరు సరదాగా నువ్వు వేరొకరి ఇంటికి కన్నం వేశావంటూ రాశారు. మరోకరు స్పందిస్తూ.. అరె అన్న.. పక్క రూమ్‌కి వెళ్లి దాన్ని తీసుకుంటే పోయేది.. దానికోసం గోడను పగలగొట్టాల్సిన అవసరం లేదు అని రాశాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..