Viral Video: ఎదురుదాడి అంటే ఇదేనేమో.. కుక్కకు చుక్కలు చూపించిన తాబేలు.. వీడియో వైరల్‌

Viral Video: సోషల్‌ మీడియాలో ప్రతి రోజు ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. కొన్ని కొన్ని వీడియోలు షాకింగ్‌ గురి చేసేలా ఉంటే.. మరి కొన్ని వీడియోలు..

Viral Video: ఎదురుదాడి అంటే ఇదేనేమో.. కుక్కకు చుక్కలు చూపించిన తాబేలు.. వీడియో వైరల్‌

Updated on: Aug 29, 2022 | 12:24 PM

Viral Video: సోషల్‌ మీడియాలో ప్రతి రోజు ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. కొన్ని కొన్ని వీడియోలు షాకింగ్‌ గురి చేసేలా ఉంటే.. మరి కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటాయి. వీడియోలు ఎక్కువగా వైరల్‌ అయ్యాయంటే అది సోషల్‌ మీడియానే అని చెప్పకతప్పదు. ఎక్కువగా పులులు, సింహాలు, మొసళ్లు, అలాగే పాములకు సంబంధించిన వీడియోలు ప్రతి రోజు సోషల్‌ మీడియాలో కుప్పలు తెప్పలుగా వైరల్‌ అవుతుంటాయి. ఇక తాజాగా ఓ కుక్క, తాబేలు వీడియో తెగ వైరల్‌ అవుతోంది.

ఓ కుక్క తాబేలుతో స్నేహం చేసేందుకు ప్రయత్నించడం ఈ వీడియోలో చూడవచ్చు. సైలెంట్‌గా ఉన్న తాబేలు దగ్గరగా కుక్క తన మూతిని పెడుతుండగా, ఒక్కసారిగా తాబేలు కుక్క నాలుకను గట్టిగా పట్టేసుకుంది. ఇంత చిన్న జీవి అయిన తాబేలు కుక్కకు బుద్ది చెప్పేలా చేసింది. కుక్క నాలుకను తాబేలు తన నోట్లో గట్టిగా పట్టేసుకోవడంతో కుక్కకు దడ పుట్టేసింది. ఈ ఫన్నీ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. తాబేలు కరిచిన వెంటనే కుక్క నాలుక నొప్పితో దిమ్మదిరిగిపోయింది. సో.. ఏ జంతువు అయినా సరే చిన్నదిగా ఉంది కదా అని, సైలెంట్‌గా ఉంది కదా అని అంచనా వేసుకోవద్దు. టైమొస్తే ఎంతటి పెద్ద జీవినైనా ఎదుర్కొనే సత్తా ఉంటుందని తెలుసుకోవాలి. ఎవ్వరిని కూడా తక్కవు అంచనా వేయవద్దు.

ఇవి కూడా చదవండి

 


మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి