Viral Video: మీ కక్కుర్తి పాడుగాను..లైఫ్‌ రిస్క్‌ అవసరమా బ్రో… చిన్న నిప్పు రవ్వ పడినా అంతా పోతరు!

ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా వదలరు మనవాళ్లు. మద్యం లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడితే.. గాయపడ్డ వారి పరిస్థితి పట్టించుకోకుండా అందినకాడికి తీసుకుని పరారయ్యే జనాలు మన వాళ్లు. తాజాగా డీజిల్ ట్యాంకర్ ఒకటి బోల్తా పడింది. ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా లేదా అనేది పట్టించుకోకుండా...

Viral Video: మీ కక్కుర్తి పాడుగాను..లైఫ్‌ రిస్క్‌ అవసరమా బ్రో... చిన్న నిప్పు రవ్వ పడినా అంతా పోతరు!
Diesel Tanker Overturned

Updated on: Aug 20, 2025 | 8:29 PM

ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా వదలరు మనవాళ్లు. మద్యం లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడితే.. గాయపడ్డ వారి పరిస్థితి పట్టించుకోకుండా అందినకాడికి తీసుకుని పరారయ్యే జనాలు మన వాళ్లు. తాజాగా డీజిల్ ట్యాంకర్ ఒకటి బోల్తా పడింది. ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా లేదా అనేది పట్టించుకోకుండా.. వెంట తెచ్చుకున్న బకెట్లు, క్యాన్లలో డీజిల్‌ను నింపుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త వైరల్ అవుతోంది.

ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో డీజిల్ ట్యాంకర్ ఒకటి కంట్రోల్ తప్పి.. రోడ్డుపై బోల్తా పడింది. విషయం తెలిసిన జనాలు.. క్యాన్లు, బకెట్లు, డబ్బాలు పట్టుకుని ఘటనా స్థలానికి తండోపతండాలుగా వచ్చారు. ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారేమో.. వారికి సాయం చేద్దామని ఒక్కరు కూడా ఆలోచించలేదు. ఆ విషయాన్ని పక్కకు పెట్టి మరీ డీజిల్ పట్టుకునేందుకు పరుగులు తీశారు.

ఈ ఘటనలో సుమారు 20 వేల లీటర్లకు పైగా డీజిల్ రోడ్డు పాలైంది. విషయం తెలియడమే ఆలస్యం.. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు డీజిల్ కోసం పరుగులు పెడుతూ వచ్చారు. వెంట తెచ్చుకున్న బకెట్లు, క్యాన్లలో డీజిల్ నింపుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజనులు మీ కక్కుర్తి పాడుగాను.. కాస్త వెనకాముందు ఆలోచించే అవసరం లేదా.. డీజిల్ ఎంత ప్రమాదకరం.. పొరపాటున ఎవరైనా అక్కడ నిప్పు అంటుకుంటే పరిస్థితి ఏంటి అంటూ మండిపడుతున్నారు.

వీడియో చూడండి:

కొన్ని లీటర్ల డీజిల్ కోసం ప్రాణాలు పణంగా పెడతారా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చిన్న నిప్పు రవ్వ పడ్డా ఎంత ప్రమాదం జరుగుతుందో అర్థం అవుతుందా.. అప్పుడు ఎవరిని బాధ్యులను చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కొన్ని రూపాయల విలువైన డీజిల్ కన్నా ప్రాణం ఎంతో ఖరీదైనది అంటున్నారు.

Follow Us