Viral Video: ఐఐటీ క్యాంపస్‌లోకి వాకింగ్‌ చేస్తూ ఎంటరైన మొసలి… అడ్మిషన్‌ కోసం కావొచ్చు అంటూ ఫన్నీ కామెంట్‌

|

Mar 24, 2025 | 8:23 PM

ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పోవై క్యాంపస్‌లో ఒక్కసారిగా అలజడి రేగింది. ఆదివారం సాయంత్రం క్యాంపస్‌లో హఠాత్తుగా మొసలి ప్రత్యక్షమైంది. రోడ్డుపై తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పద్మావతి ఆలయం, లేక్ సైట్ సమీపంలోని సరస్సు నుంచి మొసలి వచ్చినట్లు గుర్తించారు. రోడ్డుపై తిరుగుతున్న మొసలిని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో మొసలిని బంధించి సురక్షితంగా మళ్లీ సరస్సులో

Viral Video: ఐఐటీ క్యాంపస్‌లోకి వాకింగ్‌ చేస్తూ ఎంటరైన మొసలి... అడ్మిషన్‌ కోసం కావొచ్చు అంటూ ఫన్నీ కామెంట్‌
Crocodile Into Mumbai Iit C
Follow us on

ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పోవై క్యాంపస్‌లో ఒక్కసారిగా అలజడి రేగింది. ఆదివారం సాయంత్రం క్యాంపస్‌లో హఠాత్తుగా మొసలి ప్రత్యక్షమైంది. రోడ్డుపై తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పద్మావతి ఆలయం, లేక్ సైట్ సమీపంలోని సరస్సు నుంచి మొసలి వచ్చినట్లు గుర్తించారు. రోడ్డుపై తిరుగుతున్న మొసలిని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో మొసలిని బంధించి సురక్షితంగా మళ్లీ సరస్సులో విడిచిపెట్టారు. ఆదివారం రాత్రి 7-8 గంటల మధ్య ఈ సంఘటన జరిగింది. మొసలి రోడ్డుపై పాకుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ముంబై ఐఐటీ క్యాంపస్‌లో మొసలి తీరుగుతున్న వీడియోను X లో రాజ్ మహి అనే యూజర్ షేర్ చేశారు. క్యాంపస్‌లో మొసలి తిరిగిన తీరును ఆయన క్యాప్షన్‌లో ఇలా వివరించారు “ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) పోవాయ్ క్యాంపస్‌లో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది, రోడ్డుపై మొసలి తిరుగుతున్నట్లు కనిపించింది. లేక్ సైట్‌లోని పద్మావతి ఆలయం సమీపంలోని సరస్సు నుండి అది క్యాంపస్‌లోకి ప్రవేశించింది. రోడ్డుపై మొసలి సంచరిస్తున్న దృశ్యం చూస స్థానికులు భయాందోళన చెందారు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం 7-8 గంటల మధ్య జరిగింది, పౌరులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.”అని క్యాప్షన్‌లో రాసుకొచ్చారు.

“వన్యప్రాణుల భద్రత మరియు పట్టణ ప్రణాళిక గురించి ఆందోళన వ్యక్తం చేశారు. మునిసిపల్ అధికారులు, అటవీ శాఖ అధికారులు అత్యవసరంగా స్పందించి, మొసలి భయం నుంచి ప్రజలను కాపాడారు. ఈ సంఘటన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా, ఈ ప్రాంతంలోని రోడ్లపై మొసలి కనిపించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో అనేక సందర్భాల్లో మొసళ్ళు పోవై సరస్సు నుంచి రోడ్లపైకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. వన్యప్రాణుల భద్రత, పట్టణ ప్రణాళిక గురించి ఆందోళనలు వ్యక్తమయ్యాయి” అని మహి చివరగా ప్రస్తావించారు.

అయితే ఈ ప్రాంతంలో రోడ్లపై మొసలి కనిపించడం ఇదే మొదటిసారి కాదు. పోవై సరస్సు నుండి మొసళ్ళు బయటకు వచ్చి రోడ్లపై సంచరించిన సంఘటనలు చాలా ఉన్నాయి. తాజాగా వైరల్ అవుతోన్న వీడియోపై నెటిజన్స్‌ స్పందిస్తున్నారు. మీరు చదువుతున్న రోజుల్లో ఇలాంటి సంఘటనలను ఏదైనా చూశారా? అంటూ పోస్టులు పెడుతున్నారు. మొసలి అడ్మిషన్‌ కోసం ఐఐటీ క్యాంపస్‌లోకి వచ్చిందనుకుంటా అని మరొకరు ఫన్నీ కామెంట్స్‌ పోస్ట్‌ చేశారు.

వీడియో చూడండి: