Viral Video: తన బట్టతలనే ఆక్వేరియంలా మార్చేసిన తాత!

సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు చాలా మంది విచిత్రమైన ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. కొంత మంది సాదాసీదా రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటారు. మరికొందరు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రయోగాలు చేస్తుంటారు. తాజాగా ఓ తాత చేసిన చర్య చర్చనీయాంశంగా మారింది. ఏకంగా ఆయన బట్టతలనే ఆక్వేరియం చేయడం గమనార్హం. తన బట్టతలను చేపల తొట్టిగా మార్చేశాడు.

Viral Video: తన బట్టతలనే ఆక్వేరియంలా మార్చేసిన తాత!
Fish On Head

Updated on: Jan 01, 2026 | 6:21 PM

సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు చాలా మంది వింత వింత ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. కొంత మంది సాదాసీదా రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటారు. మరికొందరు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో కొంత మంది ప్రాణాలు పోగొట్టుకోగా.. మరికొంతమంది గాయాలతో బయటపడ్డారు. తాజాగా ఓ తాత చేసిన చర్య చర్చనీయాంశంగా మారింది. ఏకంగా ఆయన బట్టతలనే ఆక్వేరియం చేయడం గమనార్హం. తన బట్టతలపై చేపల తొట్టిగా మార్చేశాడు.

ఈ వైరల్ వీడియోలో ఓ వృద్ధుడు తన బట్టతల చుట్టూ ప్లాస్టిక్ కవర్ లాంటి వాటిని అతికించుకున్నాడు. ఆ తర్వాత ఒక స్త్రీ అతని తలపై నీటితోపాటు చేపలను ఉంచుతుంది. దీంతో ఆ నీటిలో చేపలు ఈత కొట్టడం ప్రారంభిస్తాయి. అనంతరం ఆ చేపలకు ఆహారం కూడా పెడుతుంది. దీంతో ఆ తాత బట్టతల చిన్నపాటి ఆక్వేరియంలా మారిపోయింది.

ఈ ఫన్నీ వీడియోను డాక్టర్ హేమంత్ మౌర్య అనే వ్యక్తి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ప్రజలు ఇలాంటి పనులు చేస్తున్నారంటూ రాసుకొచ్చారు. వీరు తమ తలపై చేపలను పెంచుకుంటున్నారు అని పేర్కొన్నారు. కాగా, 23 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ఇప్పటి వరకు 20,000 మంది వీక్షించారు. అనేక మంది లైక్స్ చేస్తూ రీట్వీట్లు చేస్తున్నారు. అంతేగాక, ఫన్నీ కామెంట్స్ కూడా పెడుతున్నారు.

 

తన తలను ఆ వ్యక్తి చేపల తొట్టెగా మార్చుకున్నారని ఓ నెటిజన్ వ్యాఖ్యానించగా.. ఇప్పుడు చేపల పెంపకం చేపట్టారు.. ఆ తర్వాత రొయ్యల, పీతల పెంపకం కూడా చేస్తాడేమో అంటూ మరో నెటిజన్ సరదాగా కామెంట్ పెట్టాడు. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు వ్యక్తులు ఇలాంటి చర్యలకు దిగుతున్నారని అంటున్నారు. వ్యక్తులకు ఇలాంటి వింత ఆలోచనలు ఎలా వస్తాయో అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఆ తాత తలపై చేపల నీటితొట్టే సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారితీసింది.