Viral Video: వాటర్ పార్క్‌లో సందడి చేసిన ఆవు.. అసలు అక్కడికి ఎలా చేరుకుందంటే.? కారణం తెలిస్తే షాకే.!

|

Nov 16, 2021 | 7:10 PM

Cow Viral Video: కబేళా నుంచి తప్పించుకున్న ఒక ఆవు వాటర్ పార్క్‌లో ప్రత్యేక్షమయింది. స్వేచ్ఛగా తప్పించుకున్న ఆవు వాటర్ స్లైడింగ్‌లో చిక్కుకుంది. ప్రస్తుతం

Viral Video: వాటర్ పార్క్‌లో సందడి చేసిన ఆవు.. అసలు అక్కడికి ఎలా చేరుకుందంటే.? కారణం తెలిస్తే షాకే.!
Cow Viral Video
Follow us on

Cow Viral Video: కబేళా నుంచి తప్పించుకున్న ఒక ఆవు వాటర్ పార్క్‌లో ప్రత్యేక్షమయింది. స్వేచ్ఛగా తప్పించుకున్న ఆవు వాటర్ స్లైడింగ్‌లో చిక్కుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ సంఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను చూసి నెటిజన్లు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. రియో డి జనీరోకు పశ్చిమాన 800 కి.మీ దూరంలో ఉన్న నోవా గ్రెనడాలోని కబేళా నుంచి తప్పించుకొని ఓ ఆవు వాటర్ పార్క్‌లోకి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. ఆవు వాటర్ స్లాటర్ నుంచి తప్పించుకొని ప్రాణాలను దక్కించుకుందని తెలిపారు. 317 కిలోల బరువున్న ఈ జంతువును వధించాలని కబేళాకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆవు అక్కడి నుంచి తప్పటించుకొని సమీపంలోని ఓపెన్-ఎయిర్ స్విమ్మింగ్ పూల్‌లో కనిపించిందని తెలిపారు. ఇది అక్కడికి చేరుకున్న తర్వాత మెట్లు ఎక్కి నీటి స్లైడ్ పైకి చేరుకుంది. ఆ తర్వాత మెల్లగా దిగువన ఉన్న కొలను వద్దకు వచ్చింది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే స్లయిడ్ కేవలం 200 కేజీల బరువు ఉండేలా డిజైన్ చేయబడినప్పటికీ అది డ్యామేజ్ కాలేదు. వాటర్‌పార్క్ ముసివేసినప్పుడు ఈ సంఘటన జరిగినట్లు అక్కడి సిబ్బంది తెలిపారు. జనసందోహం లేకపోవడంతో ఆవు భయపడలేదని.. వాటర్ స్లైడ్‌లో మెల్లమెల్లగా జారుకుంటూ చేరిందని తెలిపారు. ఈ ఘటన అనంతరం స్విమ్మింగ్ పూల్ యజమాని ఆవు ఆలనాపాలనా చూసుకునేందుకు నడుంబిగించాడు. ఆవుకు టోబోగా అని పేరు పెట్టి.. తానే పెంచుతున్నట్లు పేర్కొన్నాడు. ఇది అక్కడికి చేరకున్నప్పుడు ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు.

వీడియో..

కాగా.. దీనిపై నెటిజన్లు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. కబేళా నుంచి ఆవు తప్పించుకోవడం సంతోషంగా ఉందంటూ.. కొంతమంది సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తంచేస్తున్నారు. దాని ఆలనా పాలన చూసుకుంటామంటూ పలు సంస్థలు సైతం ప్రకటించాయి. అయినప్పటికీ.. దానిని తన దగ్గరే ఉంచుకుంటానంటూ స్విమ్మింగ్ ఫూల్ యజమాని తెలిపాడు.

Also Read:

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఆ స్టేషన్‌లో దేశంలోనే తొలి పాడ్‌ హోటల్‌.. రేపు ప్రారంభం!

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ బంధువులు సహా ఆరుగురు మృతి..