Viral Video: ఆకలి తీర్చుకోవడానికి మేక అద్భుతమైన ఐడియా.. అదిరింది గురూ అంటూ నెటిజన్లు మళ్ళీ వీడియో షేర్..

|

Feb 09, 2022 | 1:34 PM

Viral Video:మనుషులకు తాము ఏమీ తక్కువ కామని కొన్ని జంతువులు(Animals) తరచుగా నిరుపించుకుంటున్న వీడియోలు సోషల్ మీడియా(Social Media)లో తరచుగా కనిపిస్తూనే ఉన్నాయి. మనుషుల తెలివి..

Viral Video: ఆకలి తీర్చుకోవడానికి మేక అద్భుతమైన ఐడియా.. అదిరింది గురూ అంటూ నెటిజన్లు మళ్ళీ వీడియో షేర్..
Smart Goad Viral Video
Follow us on

Viral Video:మనుషులకు తాము ఏమీ తక్కువ కామని కొన్ని జంతువులు(Animals) తరచుగా నిరుపించుకుంటున్న వీడియోలు సోషల్ మీడియా(Social Media)లో తరచుగా కనిపిస్తూనే ఉన్నాయి. మనుషుల తెలివి తేటలకు, ప్రతిభకు, అవసరానికి అనుగుణంగా స్పందిస్తూ.. తెసుకునే నిర్ణయాలకు తాము ఏ మాత్రం తక్కువ కాదంటూ నిరూపిస్తున్నాయి కూడా .. మానవుడు తన తెలవి తేటలతో టెక్నాలజీని డెవలప్‌ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అసాధ్యాలను సుసాధ్యం చేసుకుంటున్నాడు. అయితే ఇందుకు జంతువులు కూడా తామేమీ తక్కువ కాదంటున్నాయి. పలు సందర్భాల్లో వాటి తెలివి తేటలను ప్రదర్శించి నిరూపించుకుంటున్నాయి. తాజాగా ఓ మేక తన ఆకలి తీర్చుకునేందుకు ఎంతో తెలివిగా వ్యవహరించింది.  తనలాగే ఆకులు అలములూ తింటూ జీవించే మరో జంతువు సహాయంతో తన ఆకలి తీర్చుకుంది.

సహజంగా మేకలు… పొలం గట్ల దగ్గరా, పచ్చిక బయళ్లలోనూ, కొండలపైనా ఆకులు, అలములు తింటాయి. కానీ ఈ మేక అక్కడ ఉన్న ఒక పెద్ద చెట్టు ఆకులు తినాలనుకుంది. అయితే అవి దానికి అందడం లేదు. అప్పుడు దానికో ఐడియా వచ్చింది. వెంటనే తన పక్కనే ఉన్న గేదె  వీపుపైకి ఎక్కి ఆ చెట్టు ఆకుల్ని అందుకుని ఎంచక్కా తినేసింది. ఆ మేక ఆకులు అందుకుని తినేవరకూ ఆ గేదె కూడా దానికి ఎంతో సహకరించింది. ఇది కదండీ… హెల్పింగ్‌ నేచర్‌ అంటే… నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోను ఓ యూజర్‌ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్‌ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు టీమ్ వర్కుతో ఏదైనా సాధ్యమే అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. వాటి సఖ్యతను మెచ్చుకుంటున్నారు.

Also Read:  మానవాళికి మరో పెనుముప్పు.. కరుగుతున్న గ్రీన్‌ల్యాండ్‌.. పెరుగుతున్న సముద్ర మట్టాలు..