
మెట్రోరైల్ స్టేషన్లను శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అధికారులదే కాదు, మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులది కూడా. ప్రీత్ విహార్ మెట్రో స్టేషన్‌లో పూటుగా తాగిన వ్యక్తి వాంతి చేసుకున్న షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి వాంతి చేసుకున్నాడని, “నువ్వు నిన్ను నువ్వు నియంత్రించుకోలేకపోతే ఎందుకు అంతగా తాగుతావు?” అని వీడియో తీస్తున్న వ్యక్తి అడగడం చూడవచ్చు.
ఈ వీడియోను Xలో షేర్ చేశారు. “ప్రీత్ విహార్ మెట్రో స్టేషన్‌లో తాగిన వ్యక్తికి, కెమెరా వ్యక్తికి మధ్య వివాదం జరిగినట్లు తెలుస్తోంది.
అయితే ఆ వీడియో పట్ల నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. అతను తాగి ఉన్నాడు, ఎవరు ఏం చెప్పినా అతనికి అర్థం కాలేదు అని రాశారు. ఢిల్లీ మెట్రో అంతా దీని గురించే చర్చ అని కామెంట్స్ చేశారు. ఈ సంఘటనను చిత్రీకరించిన వ్యక్తిని మరికొంత మంది నెటిజన్స్ ప్రశంసించారు. దేశంలోని ప్రతి పౌరుడి నుండి ఆశించేది ఇదే. కెమెరా వ్యక్తికి ధన్యవాదాలు అని రాశారు.
Kalesh b/w a Drunk guy and Camera guy over this drunk guy puked at Preet Vihar Metro Station pic.twitter.com/Djx3YQathA
— Ghar Ke Kalesh (@gharkekalesh) April 10, 2025